Anchor Suma Rajeev Divorce: యాంకర్ సుమ.. తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. రియాల్టీ షోస్ చేస్తూ బుల్లితెర టాప్ యాంకర్‌గా కొనసాగుతున్నారు. ఇక, చాలా కాలం తర్వాత సుమ వెండితెరపై సందడి చేయబోతున్నారు. 'జయమ్మ పంచాయితీ' సినిమాతో మరోసారి సినీ ప్రియులను అలరించనున్నారు. ఈ సినిమా మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమ.. తన భర్తతో విడాకులపై వచ్చిన రూమర్స్‌పై స్పందించారు.
"కరోనా సమయంలో మీ వివాహ బంధంపై రూమర్స్ వచ్చాయి, మీరు విడిపోతున్నారంటూ.. వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారని అందరూ అన్నారు.. అది నిజమేనా" అని ప్రశ్నించారు ఆలీ. అందుకు సుమ.. "ఇద్దరి మధ్య గొడవలు వాస్తవమే. ఈ 23 ఏళ్లలో ఎన్నో గొడవలు వచ్చాయి. కానీ ఒకటి మాత్రం నిజం. భార్యభర్తలుగా విడాకులు తీసుకోవడం సులభమే. కానీ తల్లిదండ్రులుగా చాలా కష్టం" అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ విషయం పక్కన పెడితే, ఈ కార్యక్రమంలో సుమ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఎన్నో నవ్వులు పంచే ఆలీకే పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్వించింది. 'జయమ్మ పంచాయితీ'లోని ఓ పాటను ఆలపించి, మరో పాటకు డ్యాన్స్ చేసి అలరించింది. తనకు ఆరుగురు అత్తయ్యలు ఉన్నారని, 13 మంది బావలు ఉన్నారని తెలిపింది. హీరోగా తమ తనయుడి ఎంట్రీ గురించి త్వరలోనే చెప్తానంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
'సిద్ధ పాత్రలో పవన్‌కల్యాణ్'.. చిరు స్పందన ఇదే
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర స్టార్ రష్మి.. ఫొటోస్ వైరల్