ETV Bharat / entertainment

Anasuya Bharadwaj Crying : వెక్కివెక్కి ఏడ్చిన అనసూయ.. ఎందుకో తెలుసా? - అనసూయ సినిమాలు

Anasuya Bharadwaj Crying : బుల్లితెర యాంకర్ అనసూయ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియోను పోస్ట్​ చేశారు. ఇంతకీ అనసూయ ఎందుకు ఏడ్చారంటే?

Anasuya Bharadwaj Crying
Anasuya Bharadwaj Crying
author img

By

Published : Aug 19, 2023, 6:07 PM IST

Updated : Aug 19, 2023, 9:36 PM IST

Anasuya Bharadwaj Crying : బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్.. వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియోను సోషల్ ​మీడియాలో షేర్ చేశారు. ఆమె గుక్కపెట్టి ఏడవటం చూసిన నెటిజన్లు షాక్​కు గురవుతున్నారు. ఈ వీడియోతో పాటు ఓ సందేశాన్ని కూడా ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు అనసూయ. అయితే ఇది ఐదు రోజుల కిందటి వీడియో అని ఆమె తెలిపారు. మరి అనసూయ ఏడవటానికి కారణమేంటంటే?

'హలో! మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతారని తెలుసు. ఇక విషయానికొస్తే.. నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​ ప్రపంచవ్యాప్తంగా ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేందుకు, సమాచారం పంచుకునేందుకు, ఒకరికి ఒకరు ఉన్నామని చెప్పుకునేందుకు, విజ్ఞానాన్ని, సంతోషాన్ని, జీవన విధానాలను, సంస్కృతి సంప్రదాయాలను షేర్​ చేసుకునేందుకే ఉంది. మరి నిజంగా ఇప్పుడు ఇదే జరుగుతుందా?' అని పోస్ట్​లో రాసుకొచ్చారు.

'ఏదేమైనా.. ఈ పోస్ట్ ఎందుకు షేర్ చేశానంటే.. నేను ఇక్కడ నా ఫొటోషూట్​లు, డ్యాన్స్​లు.. అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అవన్నీ నా జీవితంలో భాగమే. అయితే నా లైఫ్​లో బాధాకరమైన రోజులు కూడా ఉన్నాయి. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు నేనూ బలహీనమవుతా.. కన్నీళ్లూ పెట్టుకుంటా. మనిషి లైఫ్​లో అన్నీ ఉంటాయి. ఓ సెలబ్రిటీగా.. ఫీలింగ్స్ న్యూట్రల్​గా ఉంచుకునేందుకు నాపై ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నిజమైన బలం కాదు. వీక్​నెస్​ను షేర్​ చేసుకోవడమే నా బలం. ఆలాగే అందరూ సమస్య ఎదురైనప్పుడు.. ఆ బాధ పోగొట్టుకొని ఒకట్రెండు రోజుల్లో నవ్వుతూ సవాళ్లను ఎదుర్కోండి. అంతేకాని సమస్యలు చూసి పారిపోకూడదు. ఇతరులపై మీరు చేసే కామెంట్లు వారిని ఇబ్బంది పెట్టవచ్చు. అందుకని ఎదుటివారి పట్లు కొంచెం దయతో ఉండండి.' అని ఇన్​స్టా పోస్ట్​లో అనసూయ రాశారు.

అయితే ప్రస్తుతం తాను బాగున్నానని చెప్పుకొచ్చారు అనసూయ. తాను ఇన్​స్టాలో పోస్ట్ చేసిన వీడియో ఐదు రోజుల కిందటదని అన్నారు. నేను అప్పుడు పడిన బాధను గుర్తుంచుకోడానికే వీడియో రికార్డు చేశానని తెలిపారు.

బీచ్​లో మళ్లీ రెచ్చిపోయిన అనసూయ.. బికినీలో అలా చేస్తూ!

'మిర్చి' సీన్​ను రిపీట్ చేశారుగా.. మామిడితోటలో భర్తతో రొమాంటిక్​గా అనుసూయ!

Last Updated : Aug 19, 2023, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.