ETV Bharat / entertainment

Anand Devarakonda Meet Neeraj Chopra : నీరజ్ చోప్రాతో ఆనంద్ దేవరకొండ - రాహుల్ రవీంద్రన్.. ఎందుకు కలిశారో? - హీరో రాహుల్ ​​రవీంద్రన్ నీరజ్​ చోప్రా ట్వీట్​

Anand Devarakonda Meet Neeraj Chopra : ఇటీవలే జరిగిన 19వ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకంతో మెరిసిన భారత స్టార్ అథ్లెట్​ నీరజ్​ చోప్రాతో కలిసి బ్రేక్ ఫాస్ట్​ చేశారు టాలీవుడ్​ నటులు ఆనంద్​ దేవరంకొండ, రాహుల్ రవీంద్రన్. దీనికి సంబంధించిన ఫొటోలను రాహుల్​ తన ట్విట్టర్​ హ్యాండిల్​లో షేర్​ చేశారు.

Niraj Chopra Break Fast With Rahul Ravindran
Rahul Ravidran Meet Niraj Chopra
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 6:21 PM IST

Anand Devarakonda Meet Neeraj Chopra : చైనాలోని హాంగ్​జౌ వేదికగా జరిగిన 19వ ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన భారత స్టార్ జావెలిన్​ త్రో అథ్లెట్​ నీరజ్ చోప్రాతో కలిసి అల్పాహారం(బ్రేక్​ ఫాస్ట్​) చేశారు టాలీవుడ్​ నటుడు, దర్శకుడు రాహుల్​ రవీంద్రన్​. ఈ ట్రీట్​లో బేబీ ఫేమ్​ ఆనంద్​ దేవరకొండ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్​ మీడియా వేదికగా పంచుకున్నారు రాహుల్. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా తన అధికారిక ట్విట్టర్​ అకౌంట్​లో షేర్​ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్​గా మారింది.

"నాకు తెలిసిన వారెవరైనా లేదా ట్విట్టర్‌లో నన్ను ఫాలో అయ్యే ఎవరికైనా దీని అర్థం తెలుస్తుంది. ఓ ఛాంపియన్‌తో కలిసి చేసిన ఈ బ్రేక్​ ఫాస్ట్​ నేను ఎప్పటికీ మరచిపోలేను."

- రాహుల్ రవీంద్రన్​, టాలీవుడ్ హీరో

ఇక రాహుల్​ రవీంద్రన్​ విషయానికొస్తే.. 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా మంచి క్రేజ్​ సంపాదించుకున్నారు రాహుల్ రవీంద్రన్​. ఆ తరువాత పలు సినిమాలతో నటుడిగా ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో పలువురు బడా హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా నటిస్తూ అలరిస్తున్నారు. అయితే కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్​ రవీంద్రన్​. తన మొదటి సినిమా('చి ల సౌ')తోనే జాతీయ అవార్డును సైతం దక్కించుకున్నారు.

ప్రస్తుతం నటి రష్మికతో కలిసి ఓ భారీ లేడీ ఓరియెంటెడ్​ మూవీని తెరకెక్కించేందుకు రాహుల్​ రవీంద్రన్​ ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొదట ఈ ప్రాజెక్ట్​లో సమంతకు ఛాన్స్​ ఇవ్వాలని అనుకున్నారట రాహుల్​​. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమె స్థానంలో రష్మికకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ఓ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు యంగ్ అప్​కమింగ్ హీరో ఆనంద్ దేవరకొండ రీసెంట్​గా 'బేబీ' సినిమాతో సూపర్​ హిట్​ను అందుకున్నారు. ప్రస్తుతం క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్​లో రానున్న 'గం గం గణేశా' మూవీలో నటిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఈ మూవీ టీజర్​.. ఆడియెన్స్​ను తెగ ఆకట్టుకుంటోంది.

  • Anyone who knows me or even just follows me on Twitter will know what this means to me. ♥️ This breakfast with the champion will never ever be forgotten ♥️ pic.twitter.com/TaXLXnD2tD

    — Rahul Ravindran (@23_rahulr) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Suhas New Movie : అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్.. సౌండ్ అదిరింది.. సుహాస్ యాక్టింగ్ కేక

Comedian Dhanraj Direction : వేణు బాటలోనే ధన్​రాజ్​.. త్వరలో డైరెక్టర్​గా.. 'బలగం' లాంటి స్క్రిప్ట్ రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.