Amardeep Bigg Boss Remuneration : వంద రోజులకుపైగా అలరించిన బిగ్‌బాస్-7 కంప్లీట్ అయిపోయింది. విజేతగా తెలంగాణకు చెందిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు. అయితే ప్రతి సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఒకరుంటారు. అలా ఈ సీజన్లో అమర్దీప్ ఉన్నారని చెప్పొచ్చు. సీరియల్ హీరోగా మంచి పేరు సంపాదించిన అమర్దీప్ బిగ్‌బాస్ షో ప్రారంభంలో కాస్త తడబడ్డ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నారు. కొన్నిసార్లు తెలిసీతెలియక చేసిన తప్పుల వల్ల నవ్వులపాలైన తగ్గేదేలా అన్నట్లు ఫైనల్ వరకు దూసుకెళ్లారు.
Bigboss Amardeep Chowdary : హౌస్‌లో కొన్నిసార్లు స్నేహితులు కూడా అమర్‌దీప్‌ను పట్టించుకోలేదు. శివాజీ కూడా కొన్నిసార్లు అనేక మాటలు అన్నారు. అయినా అన్నింటినీ చిరునవ్వుతో భరించారు. అనారోగ్యంతో బాధపడుతున్నా బయటకు చెప్పుకోలేదు. హెల్త్ ఇష్యూ వల్ల టాస్కులు సరిగ్గా ఆడలేకపోయినా అది తన వైఫల్యంగానే చెప్పుకున్నారు గానీ అనారోగ్యాన్ని ఎప్పుడూ సాకుగా చెప్పలేదు. విజయానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన అమర్ ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచారు. మరి అమర్దీప్ ఎంత సంపాదించారో తెలుసా?
Bigg Boss 7 Amardeep Chowdary Remuneration : బిగ్‌బాస్ షోలోకి రావడానికి ముందే సీరియల్స్ ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అమర్దీప్. అందుకే ఆయనకు బిగ్‌బాస్ యూనిట్ భారీగానే ఆఫర్ చేసింది. వారానికి రూ.2.5 లక్షలు ఇచ్చారట. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ట్యాక్స్‌లు, జీఎస్టీల రూపంలో దాదాపు సగం ప్రభుత్వమే లాగేసుకుంటుందట. అయితే రన్నరప్‌గా నిలిచినందుకు అమర్‌దీప్‌కు ఏమీ లభించలేదు. ఒట్టి చేతులతోనే స్టేజ్ వీడాల్సి వచ్చింది. ఏదైతేనేం అమర్దీప్ ప్రైజ్‌మనీ గెలవకపోయినా మనసులు గెలుచుకున్నారు.
Amardeep Chowdary Serials : 2017లో 'ఉయ్యాల జంపాలా' సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రాహుల్ అనే పాత్రతో ఆకట్టుకున్నారు. 2019లో 'సిరి సిరి మువ్వలు' అశ్విన్ అనే ప్రధాన పాత్ర పోషించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా ప్రియాంక జైన్‌తో కలిసి 'జానకి కలగలేదు' సీరియల్లో నటించారు. అత్తారింటికి దారేదిలో, హిట్లర్ గారి పెళ్లాం వంటి సీరియల్స్‌లో గెస్ట్ రోల్స్ చేశారు. సీరియల్స్‌తో పాటు ఆయుష్మాన్ భవ, కేర్ ఆఫ్ అనసూయ, కృష్ణార్జున్ యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు మొదలైన చిత్రాలలో కూడా మెరిశారు. సీరియల్ నటి తేజస్విని గౌడతో ప్రేమలో పడ్డ అమరదీప్ గతేడాది ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు.
బిగ్‌బాస్ విన్నర్‌గా 'పల్లవి ప్రశాంత్'- ప్రైజ్‌మనీ మొత్తం రైతులకే!
బిగ్‌బాస్ 7 విజేత 'రైతుబిడ్డ' కవిత అదుర్స్- రెమ్యునరేషన్+ ప్రైజ్‌మనీ ఎంతంటే?