Amala Paul Pregnant Photos : హీరోయిన్ అమలా పాల్ శుభవార్త చెప్పింది. తాను తల్లిబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది. అందులో తన భర్త గుండెలో అమలా పాల్ ఉన్నట్లు, మరో ఫొటోలో బేబీ బంప్‌ను పట్టుకున్న ఫొటోలు షేర్ చేసింది. దానికి "నీతో 1+1= 3 అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది" అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రెగ్నెన్సీ, మాతృత్వానికి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టింది. దీంతో అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా అమలా పాల్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Amala paul Marriage : అమలా పాల్ 2023 నవంబర్ 5న తన ప్రియుడు, ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. కేరళలోని కొచ్చిలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ శుభవార్తను నూతన వధూవరులిద్దరూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలను షేర్ చేసి తెలిపారు. 'రెండు మనసులు ఒక్కటైన వేళ.. జీవితాంతం ఈ చేయి వదలను' అని తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు జగత్. అయితే పెళ్లికి ముందు కొంత కాలం ప్రియుడే ప్రేమలో ఉంది అమల. అనంతరం లిప్ కిస్‌లతో ఫొటోలను పోస్ట్ చేస్తూ తమ ప్రేమ విషయాన్ని అనౌన్స్ చేసింది.
Amala paul Movies : అమలా పాల్ సినిమాల విషయానికొస్తే, 2009లో మలయాళంలో విడుదలైన 'నీలమతార'తో తెరంగెట్రం చేసింది. ఆ తర్వాత తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంది. 2011లో విడుదలైన 'బెజవాడ' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు ఇద్దరు 'అమ్మాయిలతో', 'జెండాపై కపిరాజు', 'బెజవాడ', 'నాయక్' సహా కొన్ని సినిమాలు చేసింది.
ఈ సినిమా జర్నీలోనే కోలీవుడ్ దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలా పాల్. కానీ కొన్ని విబేధాల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఈ భామ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోలో నటిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బోల్డ్ ఫొటోషూట్స్‌తో రెచ్చిపోయింది. తన గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఆ మధ్యలో ముంబయికి చెందిన గాయకుడు భవీంధర్ సింగ్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయిందన్నారు. అనంతరం పెళ్లి విషయం చెప్పలేదు కానీ భవీందర్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది అమలా పాల్.
అమలాపాల్ ఏంటా పోజులు.. ఆ ఇద్దరితో కలిసి హైరేంజ్ గ్లామర్ డోస్ షో.. ఎవరబ్బా వాళ్లు?
Amala paul Latest Photos : అమలా పాల్ ఓపెన్ గ్లామర్ షో.. గుచ్చే చూపులతో.. మత్తెక్కించే పోజులతో!