Amala paul Marriage : హీరోయిన్ అమలా పాల్ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రెండో పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు, ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. కేరళలోని కొచ్చిలో ఆదివారం (నవంబర్ 5న) వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ శుభవార్తను నూతన వధూవరులిద్దరూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలను షేర్ చేసి తెలిపారు. 'రెండు మనసులు ఒక్కటైన వేళ.. జీవితాంతం ఈ చేయి వదలను' అని తన పోస్టుకు క్యాప్షన్ జోడించాడు జగత్. ఈ వివాహ వేడుకలో అమలాపాల్ లావెండర్ కలర్ లెహంగా ధరించి ఎంతో అందంగా కనిపించింది. జగత్ కూడా తన ప్రియురాలికి మ్యాచింగ్‌గా లావెండర్ కలర్ షేర్వాణీనే ధరించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సెలబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా, హీరోయిన్ అమలా పాల్.. ప్రేమ ఖైదీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ఇద్దరు అమ్మాయిలతో, జెండాపై కపిరాజు, బెజవాడ, నాయక్ సహా కొన్ని సినిమాలు చేసింది. ఈ జర్నీలోనే కోలీవుడ్ దర్శకుడు విజయ్ను(Amala paul First Husband) ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని విబేధాల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. డివొర్స్ అనంతరం ఈ భామ లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బోల్డ్ ఫొటోషూట్స్‌తో రెచ్చిపోయింది. తన గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఆ మధ్యలో ముంబయికి చెందిన గాయకుడు భవీంధర్ సింగ్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయిందన్నారు. అనంతరం పెళ్లి విషయం చెప్పలేదు కానీ.. భవీందర్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది అమలా పాల్.
ఇకపోతే గతకొద్ది కాలంగా అమలా.. జగత్ దేశాయ్‌తో ప్రేమలో ఉన్నట్లు రీసెంట్గా బయటపెట్టింది. లిప్ కిస్‌లతో ఫొటోలను పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా తమ పెళ్లి జరిగిందని పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసింది.
టూ మచ్ బోల్డ్‌గా కేతిక శర్మ - ఆ కొంటె ఎక్స్ప్రెషన్స్కు ఎవరైనా పడిపోవాల్సిందే!