ETV Bharat / entertainment

Pushpa 2: గ్లింప్స్​ వచ్చేసిందోచ్​.. తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న 'పుష్ప' - రష్మిక మందన్న లేటెస్ట్ న్యూస్

'పుష్ప ద రూల్స్'​ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్​ను విడుదల చేసింది మూవీ టీమ్​. ఓ షార్ట్​ వీడియోను రిలీజ్​ చేసింది. మీరు చూశారా?

pushpa the rules
allu arjun
author img

By

Published : Apr 5, 2023, 11:14 AM IST

Updated : Apr 5, 2023, 12:01 PM IST

'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు పాన్ ఇండియా వైడ్​గా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమా రాకముందు వరకు సౌత్ ఆడియెన్స్​ మాత్రమే ఆయన సినిమా అప్డేట్స్​ కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఆయన చిత్రాల అప్డేట్స్​ కోసం సౌత్​ టు నార్త్ ఆల్​ ఓవర్​ ఇండియాలోని​ ప్రతి ఒక్క సినీ అభిమాని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 'పుష్ప ద రైజ్​' సినిమా సంచలనం సాధించిడం వల్ల.. అభిమానులు ఈ చిత్ర సీక్వెల్​ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అప్డేట్స్​ కావాలంటూ తెగ ఆరాటపడుతున్నారు.

దీంతో ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్​గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్​. ప్రొడక్షన్​ హౌస్​ 'మైత్రి మూవీ మేకర్స్' కూడా.. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా నిర్మాణ విలువలతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అలానే అల్లు అర్జున్​ కూడా ఈ సీక్వెల్​తో 'పుష్ప' కన్నా హై రేంజ్​లో గ్రాండ్ హిట్ అందుకోవాలని.. పాన్ వరల్డ్ వైడ్​గా తన క్రేజ్​ను పెంచుకోవాలని కష్టపడుతున్నాడు. ఇక సినిమాలోని మిగతా స్టార్స్​ సైతం ఇదే తరహాలో కృషి చేస్తున్నారు.

అయితే ఎట్టకేలకు 'పుష్ప' మూవీ టీమ్​ అభిమానుల కోసం ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన ఓ షార్ట్​ వీడియోను రిలీజ్​ చేసింది మూవీ టీమ్​. 'ద హంట్​ బిఫోర్​ ది రూల్​..రివీల్​ ఆన్​ ఏప్రిల్​ 7, 4.05pm అంటూ క్యాఫ్షన్​ను జోడించింది. ఈ వీడియో తిరుపతి జైలు నుంచి బుల్లెట్​ గాయాలతో తప్పించుకున్న పుష్ప ఇప్పుడు ఎక్కడున్నాడన్న పశ్న చుట్టూ తిరుగుతోంది. ఆయన కోసం ఓ వైపు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో.. మరో వైపు ఊరి వాళ్లు నిరసనలు చేస్తున్నట్లు ఇందులో చూడొచ్చు. మరి పుష్ప ఎక్కడికి వెళ్లాడు? ఎందుకు పారిపోయాడు? ఈ విషయాలు తెలియాలంటే ఏప్రిల్​ 7 వరకు వేచి చూడాల్సిందే.

శ్రీ వల్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు..
మరో వైపు బుధవారం రష్మిక మందన్న బర్త్​డే సందర్భంగా 'పుష్ప' ప్రొడక్షన్​ టీమ్​ మైత్రీ మూవీస్​ ఓ స్పెషల్​ పోస్టర్​ను ట్విట్టర్​ వేదికగా షేర్​ చేసింది. 'అందమైన శ్రీవల్లికి 'పుష్ప' టీమ్ తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఇలా మా హృదయాలను పాలిస్తూ ఉండండి' అంటూ రాసుకొచ్చరు. ఆ ఫొటోలో రష్మిక లంగా వోణీ వేసుకున్ని క్యూట్​గా పోజు​ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోతో పాటు పుష్ప గ్లింప్స్​ సోషల్​ మీడియాలో వైరలవుతోంది.

Last Updated : Apr 5, 2023, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.