అల్లు అర్హా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అయిన ఈ చిట్టి తల్లి ఎప్పుడూ తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తన ముద్దు ముద్దు చేష్ఠలను అల్లు అర్జున్‌తో పాటు స్నేహా రెడ్డిలు అప్పుడప్పుడు తమ ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా తనలో దాగి ఉన్న మరో టాలెంట్‌ను బయటపెట్టింది ఈ చిన్నారి. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తన ఇంటి ఆవరణలోని గార్డెన్లో అల్లు అర్హ యోగాసనాలు వేస్తున్న ఓ క్యూట్ ఫొటోను తల్లి అల్లు స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే యోగా చేస్తున్న సమయంలో అర్హ వేసిన ఓ భంగిమ(స్టంట్)ను చూసి డాడీ అల్లు అర్జున్ మురిసిపోయారు. అయితే అతి చిన్న వయసులోనే ఎంతో క్లిష్టమైన యోగాసనాలు వేస్తున్న అర్హను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
చిన్నప్పటి నుంచి తండ్రితో ఎంతో అటాచ్మెంట్ పెంచుకున్న అర్హ.. ఆయనతో కలిసి అప్పడప్పుడు పలు డ్యాన్స్ వీడియోలు చేస్తుంటుంది. అంతేకాకుండా కొడుకు అయాన్, కూతురు అర్హ చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహారెడ్డి రెగ్యూలర్‌గా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. ఇలా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు పిల్లలకు సంబంధించిన ఏ విషమైనా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
దీంతో 6 ఏళ్ల వయసులోనే ఈ చిన్నారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక స్నేహ రెడ్డిని ఇన్‌స్టాలో 8.8 మిలియన్ల మందికిపైగా ఫాలో అవుతున్నారు. ఇకపోతే తండ్రి తగ్గట్టుగానే ఎంతో యాక్టివ్‌గా ఉండే అర్హ తాజాగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. విడుదలకు సిద్ధంగా ఉన్న 'శాకుంతలం' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అల్లు అర్హ.
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో సింహంపై స్వారీ చేస్తున్న భరత యువరాజుగా అర్హ కనిపించింది. మూవీలో యాక్ట్ చేయడమే కాకుండా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఈ ఫొటోను సైతం అల్లు అర్జున్ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇక శాకుంతలం సినిమాలో అర్హ నటిస్తోందన్న విషయాన్ని స్వయాన అల్లు అర్జునే ప్రకటించారు. "అల్లు" కుటుంబంలోని నాలుగో తరానికి చెందిన అర్హ వెండితెరకు పరిచయమవుతోందని తెలపడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు అల్లు అర్జున్. నా కుమార్తెను ఇటువంటి అందమైన చిత్రంతో వెండితెరకు పరిచయం చేస్తున్న గుణశేఖర్, నీలిమకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ బన్నీ కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేశారు. మరోవైపు, మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 చిత్రంలో కూడా అర్హ నటిస్తున్నట్లు సమాచారం.