ETV Bharat / entertainment

రిలీజ్​కు ముందే రికార్డుల వర్షం.. రూ.1000 కోట్ల బిజినెస్ చేసిన పుష్ప-2! - పుష్ప 2 టీజర్​ అప్డేట్​

2021లో విడుదలై తగ్గేదే లే అంటూ బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్లిన సినిమా పుష్ప ది రైజ్​. అయితే ఇప్పుడు తెరకెక్కున్న పుష్ప 2 కూడా రిలీజ్​కు ముందే ఎన్నో రికార్డులను సృష్టిస్తోంది అదేంటంటే.

pushpa 2
pushpa 2
author img

By

Published : Mar 9, 2023, 12:35 PM IST

2021లో విడుదలై బ్లాక్​ బస్టర్​ హిట్​ను సాధించిన పుష్ప సినిమా.. పాన్ ఇండియా లెవెల్​లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సివిమాలో ఐకాన్​​ స్టార్​ అల్లు అర్జున్​, రష్మిక మందన్న జంటగా నటించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్​ లుక్​తో పాటు ఆయన యాస అభిమానులను ఆకర్షించింది. 2021లో రిలీజైన ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలుగొట్టింది. ఎటువంటి ప్రమోష‌న్లు లేకుండానే బాలీవుడ్‌లో రిలీజైన ఈ చిత్రం.. ఏకంగా రూ.100 కోట్లు మేర వసుళ్లు సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని పాత్రలతో పాటు డైలాగ్స్​ కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 'పుష్ప అంటే ఫైర్​', అలాగే 'తగ్గేదే లే' అనే డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమా రష్యలో కూడా రిలీజై అక్కడ కూడా ఫర్వాలేదనిపించింది.

అయితే ఈ సినిమాకు సీక్వెల్​గా పుష్ప ద రూల్స్​ ​ తెరకెక్కుతోంది. ఇప్పటికే హైదరాబాద్​తో పాటు పలు చోట్ల శరవేగంగా షూటింగ్​ జరుగుతున్న ఈ సినిమాలో పాత క్యారెక్టర్లతో పాటు మరిన్ని కొత్త క్యారెక్టర్లు కూడా యాడ్​ అవ్వనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నటి సాయి పల్లవి కూడా ఓ కెమియో రోల్​లో నటించనున్నారట. అందుకు తన కాల్షీట్​లోని పది రోజులను కూడా కేటాయించారట. దీంతో ఈ సినిమాకు మరింత హైప్​ పెరిగింది. కాగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్‌ను లాంచ్ చేసేందుకు మూవీ టీమ్​ సన్నాహాలు చేస్తోందట.

కోట్లు గడిస్తున్న ప్రీ-రిలీజ్ బిజినెస్​..
ఇన్నీ రూమర్స్​ నడుమ తాజాగా మరో వార్త సామాజిక మాధ్యమాల్లో సంచలనాలను సృష్టిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు కోట్లు కురిపిస్తోందట! థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేసిందట. అయితే ఈ విషయంపై ఎక్కడా కూడా అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త ప్రస్తుతం నెట్టింట హల్​ చల్​ చేస్తోంది. కాగా, పుష్ప - ది రైజ్ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది 2021లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా రికార్డుకెక్కింది.

ఇక సినిమా ఇతర వివరాల విషయానికి వస్తే.. మైత్రీ మూవీ మేకర్స్​, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా తెరకెక్కించిన సినిమా పుష్ప. సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్​ సరసన నేషనల్​ క్రష్​ రష్మిక మందన్న నటించారు. సునీల్​, ఫహాద్​ ఫాజిల్​, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.