Allu Arjun National Award : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కుమారుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమై.. పుష్ప సినిమాతో నేడు పాన్ఇండియా స్టార్‌గా ఎదిగారాయన. సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను అధిగమించారు అల్లు అర్జున్. ప్రతి సినిమాకు తనలోని కొత్తదనాన్ని పరిచయం చేస్తూ.. ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్‌గా పేరొందారు. అలా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు.
ఇక పుష్ప సినిమాతో తగ్గేదెలే అంటూ ఒక ట్రెండ్‌ను సెట్ చేయడంలో బన్నీ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో తన మేనరిజం దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఆయా సందర్భాల్లో ప్రముఖ నటులు, క్రికెటర్లు తన మేనరిజాన్ని ఫాలో అయ్యారు. కాగా ఈ సినిమాలో బన్నీ నటనకుగాను కేంద్రం ఉత్తమ నటుడి అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. కాగా 69 ఏళ్లలో తెలుగు హీరోకు ఉత్తమ నటుడి అవార్డు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. పుష్ప పాత్రతో పాటు తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మరి కొన్ని క్యారెక్టర్లు ఎంటో చూద్దాం.
1. పష్పరాజ్..
బన్నీ కెరీర్లో ఎవర్గ్రీన్ పాత్రల్లో పుష్పరాజ్ ఒకటి. ఈ పాత్రలో అల్లు అర్జున్ నటనకు యావత్ దేశం ఫిదా అయ్యింది. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించడం కోసం ఆయన.. రెండు గంటలపాటు కదలకుండా మేకప్ వేసుకున్నారని ఆ మధ్య డైరెక్టర్ సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. కాగా ఈ పాత్రలోని నటనకే తాజాగా నేషనల్ అవార్డు లభించింది.
-
After ruling the box office, it is PUSHPA RAJ'S RULE at the #NationalAwards 🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Icon Star @alluarjun BECOMES THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#AlluArjun Wins the Best Actor at the 69th National Awards for #Pushpa ❤️🔥#ThaggedheLe… pic.twitter.com/s3Wz2ObPKq
">After ruling the box office, it is PUSHPA RAJ'S RULE at the #NationalAwards 🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2023
Icon Star @alluarjun BECOMES THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#AlluArjun Wins the Best Actor at the 69th National Awards for #Pushpa ❤️🔥#ThaggedheLe… pic.twitter.com/s3Wz2ObPKqAfter ruling the box office, it is PUSHPA RAJ'S RULE at the #NationalAwards 🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2023
Icon Star @alluarjun BECOMES THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#AlluArjun Wins the Best Actor at the 69th National Awards for #Pushpa ❤️🔥#ThaggedheLe… pic.twitter.com/s3Wz2ObPKq
-
Thank you #SIIMA2022 ! Soo Blessed by the people to the best actor once again . It’s soo rare that getting it once itself is a dream & when it happens twice I truly feel very fortunate . Thank you for all the love . Gratitude 🙏🏽 pic.twitter.com/Nn5wexTqMM
— Allu Arjun (@alluarjun) September 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you #SIIMA2022 ! Soo Blessed by the people to the best actor once again . It’s soo rare that getting it once itself is a dream & when it happens twice I truly feel very fortunate . Thank you for all the love . Gratitude 🙏🏽 pic.twitter.com/Nn5wexTqMM
— Allu Arjun (@alluarjun) September 11, 2022Thank you #SIIMA2022 ! Soo Blessed by the people to the best actor once again . It’s soo rare that getting it once itself is a dream & when it happens twice I truly feel very fortunate . Thank you for all the love . Gratitude 🙏🏽 pic.twitter.com/Nn5wexTqMM
— Allu Arjun (@alluarjun) September 11, 2022
2. గోన గన్నారెడ్డి..
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాలో అల్లుఅర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించారు. తెలంగాణ యాసలో బన్నీ పలికిన డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. కాగా ఈ సినిమాలో బన్నీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
3. సూర్య..
'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో సైనికుడి పాత్రలో కనిపించారు బన్నీ. ఈ చిత్రంలో బన్నీ లుక్స్ ఛాలెంజింగ్‌గా ఉంటాయి. అయితే ఈ సినిమా ఫలితం అటుంచితే.. ఇందులో బన్నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిగా కనిపిస్తారు.
4. కేబుల్ రాజు..
అల్లు అర్జున్ కెరీర్లో మర్చిపోలేని చిత్రాల్లో 'వేదం' ఒకటి. క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా.. బన్నీకి అప్పట్లో మంచి ప్రయత్నంగా నిలిచిపోయింది. ఓ బస్తీ కుర్రాడి పాత్రలో మనలో ఒకడిగా కనిపిస్తాడు. ఒకే సినిమాలో ఐదు వేర్వేరు కథలను క్రిష్.. ఈ సినిమాలో చూపిన విధానం అద్భుతం.
5. విరాజ్..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో వినోదంతో పాటు విలువల్నీ చూపారు. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ కథలో.. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు పాత్రలో బన్నీ ఒదిగిపోయారు.