Allu Arjun National Award 2023 : నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్.. తన భార్య స్నేహ రెడ్డితో కలిసి సోమవారం దిల్లీ పయనమయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో.. ఉత్తమ నటుడిగా ఆయన ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రపతి భవన్లో జరగనున్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు బన్నీ దిల్లీ వెళ్లారు. ఈ కార్యక్రమంలో బన్నీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఇక వీరికంటే ముందు దర్శకధీరుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి రాజధాని నగరం చేరుకున్నారు.
పుష్ప టీమ్ దిల్లీకి.. పుష్ప డైరెక్టర్ సుకుమార్, చిత్ర నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ దిల్లీ వెళ్లారు. దీంతో 'పుష్ప ది రూల్' చిత్రీకరణకు కాస్త విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ కూడా మంగళవారం అవార్డు అందుకోనున్నారు. ఇక 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో పుష్ప ది రైజ్ విడుదలైంది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కాగా, బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. దాదాపు రూ. 330 కోట్ల మేర వసూల్ చేసింది. ఇక ఇదే సినిమాకుగాను గతేడాది అల్లు అర్జున్ సైమాలో బెస్ట్ యాక్టర్ మేల్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే.
'ఆర్ఆర్ఆర్' కు ఆరు అవార్డులు.. ఈ పురస్కారాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు అవార్డుల వెల్లువ కొనసాగింది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్), ఉత్తమ నేపథ్య గాయకుడు, స్పెషల్ ఎఫెక్ట్స్, స్టంట్ కొరియోగ్రాఫర్ ఇలా ఆరు కేటగిరీల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా అవార్డులు దక్కించుకుంది. ఇక ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విభాగంలో ఎమ్ఎమ్ కీరవాణి.. మంగళవారం అవార్డు అందుకోనున్నారు.
ఉత్తమ తెలుగు సినిమా.. మెగాహీరో వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి నటించిన సినిమా 'ఉప్పెన'. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించారు. 2021 జాతీయ అవార్డుల్లో ఉప్పెన ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఇక 'కొండపొలం' సినిమాకు పాటలు రాసిన చంద్రబోస్.. ఉత్తమ గీత రచయిత పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిందే.
National Awards Reactions : పుష్ప టీమ్ ఎమోషనల్.. 'నేషనల్' విన్నర్స్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్