ETV Bharat / entertainment

'శాకుంతలం'తో సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీ.. డబ్బింగ్ పూర్తి చేసిన అల్లు అర్హ! - undefined

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ.. 'శాకుంతలం' చిత్రంతో వెండితరపైకి అరంగేట్రం చేయనుంది. అందుకు సంబంధించిన డబ్బింగ్​ షెడ్యూల్​ను అర్హ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. చిన్నారి డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

allu arha dubbing
allu arha dubbing
author img

By

Published : Jan 18, 2023, 10:47 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్‌లో తెలియని వారుండరు. సమంత నటించిన 'శాకుంతలం' సినిమాతో చిన్నారి అర్హ.. వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌లో సింహంపై స్వారీ చేస్తున్న భరత యువరాజుగా అర్హ కనిపించింది.

ఇటీవలే ఆరో ఏటా అడుగుపెట్టిన అల్లు అర్హ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. తాజాగా శాకుంతలం చిత్రానికి సంబంధించి అర్హ డబ్బింగ్ చెబుతున్న ఫొటోను అల్లు అర్జున్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. డబ్బింగ్​ షెడ్యూల్​ను అర్హ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

allu arha dubbing
అల్లు అర్జున్​ పోస్ట్​

గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుణ టీమ్‌వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై టాలీవుడ్ నిర్మాత దిల్​రాజు సమర్పిస్తున్నారు. నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాకుంతలం చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. వచ్చే నెల 17వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను త్రీడీలో కూడా రిలీజ్​ చేయనున్నారు మేకర్స్. మరోవైపు, మహేశ్ బాబు- త్రివిక్రమ్​ కాంబోలె తెరకెక్కుతున్న SSMB28 చిత్రంలో అర్హ నటిస్తున్నట్లు టాక్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.