ETV Bharat / entertainment

నెట్టింట వైరల్​గా మారిన బన్నీ ఫొటో.. 'పుష్ప-2' షూటింగ్​ స్టార్ట్​ అయిందా? - పుష్ప 2 సినిమా హీరోయిన్

'పుష్ప-2' సినిమా షూటింగ్​ ప్రారంభమైందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే బన్నీకి సంబంధించిన లేటెస్ట్​ ఫొటో ఒకటి నెట్టింట వైరల్​గా మారింది. దీంతో ఆదివారమే షూటింగ్​ స్టార్​ అయిందని తెలుస్తోంది. అసలేంటి ఆ ఫొటో?

Allu Arjun  Pushpa 2 shooting
Allu Arjun Pushpa 2 shooting
author img

By

Published : Oct 30, 2022, 3:42 PM IST

అల్లు అర్జున్​ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప'.. దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు చెందిన 'తగ్గేదే లే' అనే డైలాగ్​ అనుకరించని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. దీంతో ఈ సినిమా పార్ట్​-2 పై అంచనాలు పెరిగిపోయాయి. పుష్ప -2 షూటింగ్ ఎప్పుడెప్పుడు మొద‌లుకానుందా అని చాలా రోజులగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఎట్ట‌కేల‌కు ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఆదివారం.. పుష్ప సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లా క్యూబా బ్రోజెక్ పోస్ట్ చేసిన ఫొటో చూస్తుంటే సినిమా షూటింగ్ మొద‌లైంది నిజ‌మేన‌ని తెలుస్తోంది. అడ్వెంచ‌ర్ హాజ్‌ బిగెన్ అంటూ అల్లు అర్జున్‌తో క‌లిసి ఉన్న ఓ ఫొటోను మిరోస్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో బ‌న్నీపై ఫ్రేమ్ సెట్ చేస్తూ మిరోస్లా క‌నిపిస్తున్నారు. థాంక్స్ టూ ఐకాన్ స్టార్ అంటూ మిరోస్లా ఈ ఫొటోకు క్యాప్ష‌న్ జోడించాడు.

Allu Arjun  Pushpa 2 shooting
అల్లు అర్జున్

గ‌త ఏడాది విడుద‌లైన పుష్ప పార్ట్ -1 0బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. తెలుగు, హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్ మేన‌రిజ‌మ్స్‌తో పాటు త‌గ్గేదేలే అనే డైలాగ్ పాపుల‌ర్ అయ్యింది. 'పుష్ప ది రూల్' పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సీక్వెల్​లో సిండికేట్ నాయ‌కుడిగా పుష్పరాజ్‌ ప్ర‌యాణంతో పాటు అత‌డి ఫ్యామిలీ జ‌ర్నీని ద‌ర్శ‌కుడు సుకుమార్ ఆవిష్క‌రించ‌బోతున్నారని సమాచారం.

ఇవీ చదవండి : సామ్​ అద్భుతమైన అమ్మాయి.. త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నా: చిరు

'అందరికీ భాయిజాన్​.. మరి మాకెందుకు పెద్దన్నలా ఉండరు?'.. సల్మాన్​పై నటి ప్రశ్నల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.