ETV Bharat / entertainment

అట్లీతో బన్నీ మూవీ కన్ఫార్మ్!- షూటింగ్ స్టార్ అయ్యేది అప్పుడే! - అల్లు అర్జున్ అట్లీ సినిమా అప్​డేట్

Allu Arjun Atlee : 'పుష్ప ది రూల్' షూటింగ్​లో బిజీగా ఉన్న అల్లు అర్జున్, నెక్ట్స్​ తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. తాజాగా దీనికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది.

allu arjun atlee
allu arjun atlee
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 2:28 PM IST

Updated : Dec 26, 2023, 10:24 PM IST

Allu Arjun Atlee : ఐకాన్​స్టార్ అల్లు అర్జున్- స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందనని ఇదివరకే కొన్ని కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో వార్త హాట్​ టాపిక్​గా మారింది. ప్రస్తుతం 'పుష్ప ది రూల్'తో బిజీగా ఉన్న అల్లు అర్జున్, అట్లీ సినిమాకు ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది. పుష్ప-2 షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.

ఈ సినిమాలో బన్నీ కంప్లీట్ డిఫరెంట్ లుక్​లో కనిపించనున్నారట. ఇది పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 2024లో షూటింగ్ ప్రారంభించాలని అట్లీ భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైతే దీనిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అఫీషియల్​గా అనౌన్స్​ చేస్తారని ఇన్​సైడ్ టాక్.

మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్! : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్- అట్లీ కాంబోలో తెరకెక్కిన 'జవాన్' భారీ విజయం దక్కించుకుంది. వరల్డ్​వైడ్​గా ఈ సినిమా రూ.1000 కోట్లు వసూల్ చేసింది. ఇక ఈ సినిమా సక్సెస్​పై అప్పట్లో అల్లు అర్జున్ మూవీటీమ్​కు ట్విట్టర్​లో శుభాకాంక్షలు తెలిపారు. అయితే బన్నీ ఈ ట్వీట్​ పోస్ట్​ చేసిన కొంతసేపటి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ 'థాంక్యూ మై బ్రో' అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి బన్నీ 'థాంక్యూ సరిపోదు నాకు మంచి పాటలు కావాలి' అంటూ అనిరుధ్​ ట్వీట్​కు రిప్లై ఇచ్చారు. దీంతో అట్లీ-అర్జున్-అనిరుధ్ (AAA) కాంబోలో త్వరలోనే ఓ ప్రాజెక్ట్​ తెరకెక్కనుందంటూ అప్పట్నుంచే సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్​ అవుతున్నాయి.

మరోవైపు పుష్ప -2 త‌ర్వాత త్రివిక్ర‌మ్‌ సినిమా షూటింగ్‌లో బ‌న్నీ పాల్గొనున్న‌ట్లు నెట్టింట పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషియా ఫాంట‌సీగా రూపొందుతున్న ఆ మూవీలోఅల్లు అర్జున్‌ లీడ్​ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరూ ఈ విషయంపై చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. అయితే ఈ కథ‌ను సిద్ధం చేయ‌డానికి త్రివిక్రమ్​కు చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో త్రివిక్ర‌మ్ మూవీ స్థానంలో అట్లీ మూవీని సెట్స్‌పైకి తీసుకురావాలంటూ బ‌న్నీ ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు టాక్ నడుస్తోంది. ఏదీ ఏమైనప్పటికీ ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్​మెంట్ వస్తే కానీ ఓ క్లారిటీ రాదు.

'బన్నీతో నటించాలని ఉంది - ఎవరైనా​ మా ఇద్దరితో సినిమా తీస్తారా?'

స్టార్ డైరెక్టర్లతో లైనప్​.. అల్లు అర్జున్​ క్రేజ్ మామూలుగా లేదుగా!

Last Updated : Dec 26, 2023, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.