పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి రిస్క్ చేయడానికైనా ముందుంటున్నారు హీరోలు. కథ, పాత్ర డిమాండ్ చేయాలేగాని జాగ్రత్తలు పాటిస్తూనే ఏలాంటి సాహసమైనా చేస్తున్నారు. ముఖ్యంగా తమ సినిమాల్లో నేచురాలిటీ ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రీసెంట్గా నేచురల్ స్టార్ నాని.. తన తాజా సూపర్ హిట్ 'దసరా'లో తన పాత్ర కోసం కొన్ని సన్నివేశాల్లో నిజంగానే మందు తాగి నటించినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో కొందరు ఆయనకు మద్దతుగా నిలవగా.. మరికొందరూ మాత్రం తాగి చేయాల్సిన అంత అవసరమేముంది అని కూడా అన్నారు! ఇప్పుడు అల్లరి నరేశ్ కూడా అలాంటిదే చేశారు. అయితే ఆయన మందు తాగి కాదు. తన కొత్త చిత్రంలోని సిగరెట్లు తాగి నటించానని చెప్పారు. సినిమాల్లో ఏదో ఒకటి రెండు కాల్చడం పెద్ద విషయమేని కాకపోయినా.. నరేశ్ మాత్రం ఏకంగా ఐదురాందల సిగరెట్లు తాగానని చెప్పి షాక్ ఇచ్చారు. అది కేవలం నాలుగు రోజుల్లో తాగారట.
విషయానికొస్తే.. 'నాంది' లాంటి సూపర్ హిట్ తర్వాత హీరో అల్లరి నరేశ్- దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'ఉగ్రం'. నరేశ్ కెరీర్‌లో ఇది 60వ సినిమా కావడం విశేషం. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా మే 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లలో జోరు పెంచింది మూవీ టీమ్. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. ఉగ్రం సినిమా కోసం తాను ఎంతగా కష్టపడ్డారో వివరించారు. ఈ మూవీ కోసం కేవలం నాలుగు రోజుల్లోనే ఐదారువందల సిగరెట్స్ తాగినట్లు చెప్పుకొచ్చారు. దీంతో తన ఆరోగ్యం కూడా దెబ్బతిందని తెలిపారు. "అడవిలో ఓ ఫైట్ సీన్‌లో స్మోక్ మిషన్స్ పెట్టారు. ఓవైపు దట్టంగా పొగ వచ్చేలా మిషన్లు పెట్టి... మరోవైపు నన్ను సిగరెట్ తాగుతూ రమన్నారు. అలా దాదాపు నాలుగు రోజుల్లో ఐదారువందలు సిగరెట్లు తాగేశాను. దీంతో దగ్గు, జ్వరంతో నా ఆరోగ్యం దెబ్బతింది" అని చెప్పుకొచ్చారు.
కాగా, వరుసగా కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన అల్లరి నరేశ్.. కొంతకాలంగా తన రూట్ మార్చుకున్నారు. కామెడీకి ఫుల్ స్టాప్ పెట్టి సీరియస్ రోల్స్ సినిమాలు చేస్తున్నారు. అలా నాంది సినిమాతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఆయన.. ఆ తర్వాత అదే డైరెక్టర్ విజయ్ కనకమేడలతో కలిసి ఇప్పుడు ఉగ్రంతో రానున్నారు. మరి ఈ సినిమా నాందిని మించిన హిట్‌ను అందుకుంటుందో లేదో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: మాస్ మహారాజా రవితేజ రుణం తీర్చుకున్న సునీల్!