ETV Bharat / entertainment

చిరంజీవి సినిమాపై సీనియర్ డైరెక్టర్​ కామెంట్స్​.. ఏంటంటే? - ఆలీతో సరాదాగా లేటెస్ట్ ప్రోమో

సీనియర్‌ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఆలీతో సరదాగా షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి నటించిన ఓ సినిమా గురించి మాట్లాడారు. ఏంటంటే..

chiranjeevi
చిరంజీవి
author img

By

Published : Sep 13, 2022, 1:54 PM IST

రాజశేఖర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన 'మా అన్నయ్య' చిత్రానికి నెల రోజుల పాటు దర్శకుడిగా పనిచేసిన తర్వాత 'సుబ్బయ్యగారు ఈ సినిమా మానేయండి' అన్నారని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు సీనియర్‌ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

"మూడు ముళ్ల బంధం చిత్రంతో దర్శకుడిగా మారానని చెప్పిన ఆయన అప్పటికే జీవితంలో మూడు ముళ్లు వేశానని అది పెద్ద ఫ్లాప్‌ అని సరదాగా వ్యాఖ్యానించారు. తొందరపడి కోయిల ముందే కూసిందని, తాను త్వరగా పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. ఎడిటర్‌ మోహన్‌ మలయాళంలో ‘హిట్లర్‌’ చూసి, 'చిరంజీవితో మీరే చేయాలి' అన్నారని, అది తన అదృష్టమన్నారు. ఇక తన కెరీర్‌లో రాజశేఖర్‌తో ఎక్కువ సినిమాలు చేశానని, దాదాపు అన్నీ ఘన విజయం సాధించాయని చెప్పారు. 'ఏదో సినిమా విషయంలో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోదామనుకున్నారా..?' అని ప్రశ్నించగా.. ‘జగపతిబాబు హీరో, ఇంద్రజ హీరోయిన్‌. నేనేమో సౌందర్య కరెక్ట్‌ అనుకున్నా. కానీ, ఆయన ఇంద్రజను తీసుకున్నారు. ఆ విషయంలో బాధ కలిగింది’ అని ముత్యాల సుబ్బయ్య పేర్కొన్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీ విడిచి వెళ్లిపోదామనుకున్నాన్నట్లు చెప్పారు. ఈ పూర్తి ఎపిసోడ్‌ సెప్టెంబరు 19న ఈటీవీలో ప్రసారం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: మహేశ్​బాబుతో సినిమా.. అదిరిపోయే అప్డేట్​ ఇచ్చిన జక్కన్న

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.