ETV Bharat / entertainment

పూజాతో వెంకీ, వరుణ్​ చిందులు.. 'సలార్​', 'మేజర్​​' అప్డేట్స్​ - అడివి శేష్​ మేజర్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో ప్రభాస్​, వెంకటేశ్​, వరుణ్​, విజయ్​సేతుపతి, అడివిశేష్​, మోహన్​బాబు చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు..

ఎఫ్​ 3 పార్టీ సాంగ్​
F3 party song released
author img

By

Published : May 17, 2022, 7:17 PM IST

Updated : May 17, 2022, 7:26 PM IST

F3 Poojahegdey party song: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో... వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం 'ఎఫ్‌3'. తమన్నా, మెహ్రీన్‌, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. మే 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, పూజాహెగ్డేలపై 'లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా' అనే ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. తాజాజా ఆ గీతానికి సంబంధించిన ఫుల్​ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో వెంకటేశ్​, వరుణ్ పోటీగా స్టెప్పులేయగా.. పూజా గ్లామర్​ హైలైట్​గా నిలిచింది. మొత్తంగా ఈ పాట శ్రోతలను ఉర్రూతలూగించేలా ఉంది. ఇక ఈ పాటను రాహుల్ సిప్లి గంజ్, గీత మాధురి ఆలపించగా, కాసర్ల శ్యామ్ సంగీతం అందించారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిన ఈ గీతం పార్టీ సాంగ్‌గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని సినీ వర్గాలు తెలిపాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Alitho saradaga F3 movie team: నటుడు సునీల్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి... ఆలీతో కలిసి సందడి చేశారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న 'ఎఫ్‌' చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సునీల్‌, అనిల్‌.. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి, పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో సునీల్‌, ఆలీ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎంత ఫన్‌ ఉండబోతుందో ఈ వేదికపై చర్చించారు. 'అనిల్‌ అండ్‌ సునీల్‌' అని ఏదైనా సినిమాకు టైటిల్‌ పెడితే బాగుంటుందంటూ ఆలీ కామెడీ పండించారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభూతినిచ్చందని సునీల్‌ పేర్కొన్నారు. బస్‌ డిపోను తలపించేలా కారవాన్‌లు ఉండేవని, అంతమంది నటీనటులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. 'ఎఫ్‌ 4' ఉంటుందా అని ఆలీ అడగ్గా "ప్రేక్షకులకు వినోదం పంచడమే మన విధి. కచ్చితంగా ఉంటుంది" అని అనిల్‌ సమాధానమిచ్చారు. బాలకృష్ణతో తాను తెరకెక్కించే చిత్రం పవర్‌ఫుల్‌ యాక్షన్‌ నేపథ్యంలో ఉంటుందని తెలిపారు. ఈ పూర్తి నవ్వుల రైడ్‌ 'ఈటీవీ'లో మే 23 రాత్రి 9:30 గం.లకు ప్రసారంకానుంది.

Major song promo: 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'మేజర్‌'. అడివి శేష్‌ టైటిల్‌ పాత్ర పోషించగా శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశి కిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్​ను స్పీడ్​ పెంచిన మూవీటీమ్​.. ఈ మూవీలోని ఓ పాటను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 'ఓ ఇషా' అనే లవ్​ వీడియో సాంగ్ ప్రోమోను రిలీజ్​ చేసింది. పూర్తి పాటను ను మే 18న సాయంత్రం 4.05గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. కాగా, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు.

Son of India OTT Release date: మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన 'సన్‌ ఆఫ్‌ ఇండియా' ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మంగళవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రాన్ని దర్శకుడు డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించారు. ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలోని మోహన్‌బాబు లుక్స్‌, దేశం గురించి ఆయన చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేస్తున్నాయి. ఈ సినిమాలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రీకాంత్‌, అలీ, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఇళయరాజా సంగీతం అందించారు.

Kathuvakula rendu kadal ott release date: రొమాంటిక్‌, కామెడీ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రం 'కాతు వాకుల రెండు కాద‌ల్'. ఈ మూవీకి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా' పేరుతో విడుదలైంది. తమిళంలో పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్న ఈ చిత్రంలో స్టార్స్ విజ‌య్ సేతుప‌తి, స‌మంత‌,న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. తాజాగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. హాట్ స్టార్​లో ఈ చిత్రం ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Prabhas Salar twitter handle: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'సలార్'. తాజాగా ఈ మూవీ పేరిట ట్విట్టర్ హ్యాండిల్​ను రూపొందించారు మేకర్స్​. ఇకపై 'Salaar the saga' పేరుతో ఉన్న ఈ ట్విట్టర్​ హ్యాండిల్ ద్వారా చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తెలపనున్నట్లు వెల్లడించారు. ఇటీవల 'కేజీయఫ్ 2' చిత్రం సంచలన విజయం సాధించడం వల్ల.. 'సలార్'​పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక 'సాహో', 'రాధేశ్యామ్'​తో వరుసగా అభిమానుల్ని నిరాశపరిచిన ప్రభాస్​.. ఈ చిత్రంతో బిగ్గెస్ట్​ హిట్​ కొట్టాలని అభిమానులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: స్టార్​ దర్శకుడిని రిజెక్ట్​ చేసిన అల్లుఅర్జున్.. కారణమిదేనా?

Last Updated : May 17, 2022, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.