ETV Bharat / entertainment

'ఏజెంట్' ప్రీ రిలీజ్​ బిజినెస్.. అయ్యగారి టార్గెట్ ఫిక్స్! - అఖిల్ అక్కినేని ఏజెంట్​ రిలీజ్ డేట్​

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ అక్కినేని నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్​ చిత్రం 'ఏజెంట్‌'. మరో రెండు రోజుల్లో సినిమా గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్​ బిజినెస్​ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం..

agent bussiness
'ఏజెంట్' ప్రీ రిలీజ్​ బిజినెస్.. అయ్యగారి టార్గెట్ ఫిక్స్!
author img

By

Published : Apr 26, 2023, 3:15 PM IST

Updated : Apr 26, 2023, 4:56 PM IST

అఖిల్‌ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్​ చిత్రం 'ఏజెంట్‌'. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్​ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అఖిల్ పట్టుదలతో ఉన్నారు. మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాలతో మంచి దర్శకుడిగా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి.. వక్కంతం వంశీ అందించిన కథతో.. ఏజెంట్ సినిమాను రూపొందించారు. ఇందులో అఖిల్ స్పై ఏజెంట్​గా కనిపించబోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్​గా నటించగా.. మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్​ను ఏకే ఎంటర్టైన్మెంట్స్​పై నిర్మాత అనిల్ సుంకర.. దర్శకుడు సురేందర్​తో కలిసి నిర్మించారు. ఈ చిత్రంతోనే సురేందర్​ నిర్మాతగా మారారు. రూ.40కోట్ల అంచనాలతో ఈ సినిమాను ప్రారంభించగా.. దాదాపు రూ.80కోట్ల వరకు ఖర్చు అయిందని ప్రచారం సాగింది. అయితే ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఈ నెల 28న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. మొదట్లో పాన్​ ఇండియా స్థాయిలో దీన్ని రిలీజ్​ చేద్దామనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మలయాళం, తెలుగు భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్​ బిజినెస్​ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ట్రెడ్​ వర్గాల సమాచారం ప్రకారం..

అఖిల్ చివరి సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'​ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.18.50 కోట్లు జరగగా.. ఇప్పుడు 'ఏజెంట్' దానికి డబుల్ ఫిగర్స్​ను అందుకుంది. నైజాం ఏరియాలో​ రూ.10కోట్లు, సీడెడ్​ రైట్స్​ రూ.4.50కోట్లు, ఆంధ్ర ఏరియా మొత్తం రూ.14.80కోట్లు, ఆంధ్ర-తెలంగాణ కలిపి రూ.29.30కోట్లు, కర్ణాటక అండ్​ రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.3.80కోట్లకు, ఓవర్సీస్​ ద్వారా రూ.3.10కోట్లు. మొత్తంగా వరల్డ్​ వైడ్​ రూ.36.20కోట్లు బిజినెస్ చేసినట్లు తెలిసింది. అంటే సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్​ రూ.37కోట్లు అన్న మాట. అఖిల్ కెరీర్ ఇది​ సెకండ్ హైయెస్ట్​ ప్రీ రిలీజ్​ బిజినెస్​. ఆయన నటించిన మొదటి సినిమా అఖిల్​.. అప్పట్లో ప్రీ రిలీజ్​ బిజినెస్​ రూ.42కోట్లు జరగగా.. 'ఏజెంట్' దానికి దగ్గరగా వచ్చింది.

ఇకపోతే అఖిల్​తో పాటు దర్శకుడు సురేందర్​.. ఈ సినిమాకు పూర్తిస్థాయిలో పారితోషికం తీసుకోలేదని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా భారీ స్థాయిలో హిట్​ అయి.. లాభాలు అందుకుంటేనే.. వాటిలో తీసుకుంటారట. చూడాలి మరి ఈ మూవీ ఏ స్థాయిలో విజయాన్ని సాధించి.. ప్రాఫిట్​ను అందుకుంటుందో..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'సాగరకన్య'గా దివి.. మరి హాట్​గా ఉన్న ఈ బికినీ పాప ఎవరో తెలుసా?

Last Updated : Apr 26, 2023, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.