ETV Bharat / entertainment

ఈ చిన్నారి కుర్రాళ్ల మనసు దోచిన హీరోయిన్​.. నేషనల్​ అవార్డు గ్రహీత కూడా - ఆకాశమే హద్దురా అపర్ణ బాలమురళి

ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ప్రస్తుతం నటి మాత్రమే కాదు ప్లేబ్యాక్ సింగర్, క్లాసికల్ డ్యాన్సర్ కూడా. సూర్యతో కలిసి ఓ సినిమాలో నటించిన ఈమె ఆ చిత్రానికి ఊత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. ఈ మూవీలో ఆమె నటన చూసి కుర్రాళ్లంతా ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే బాగుండు అనేంతగా.. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా.. ట్రై చేయండి.. తెలియకపోతే.. కింద స్టోరీ చదివేయండి..

Aparna Balamurali Child Hood Pic
అపర్ణ బాలమురళి చిన్ననాటి పిక్​
author img

By

Published : Sep 16, 2022, 9:37 PM IST

Updated : Sep 16, 2022, 9:58 PM IST

ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ప్రస్తుతం నటి మాత్రమే కాదు ప్లేబ్యాక్ సింగర్, క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఆమె నటన, అందానికి దక్షిణాది ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. కాకపోతే ఇప్పటివరకు తెలుగులో నేరుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇటీవలే ఆమెకు ఓ సినిమాకుగానూ ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఎవరో గుర్తుపట్టారా...

ఎవరో కాదు నటి అపర్ణ బాలమురళి. కేరళకు చెందిన ఈ అమ్మడు.. త్రిసూర్​లో పుట్టి పెరిగింది. నటి కాకముందు సింగర్, డ్యాన్సర్​గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించింది. 'ఒరు సెకండ్ క్లాస్ యాత్ర' సినిమాతో వెంటితెర అరంగేట్రం చేసింది. అలా మలయాళంతో పాటు తమిళంలోనూ నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. 'సర్వం తాళమయం' అనే డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్​ను పలకరించింది. ఇక లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన 'ఆకాశమే నీ హద్దురా!' చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు మనసుల్లో స్థానం సంపాదించింది. ఇందులో ఆమె తన నటనతో ఎంతో మంది కుర్రాళ్లను ఫిదా చేసింది. ఎంతలా అంటే.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే అనుకునేంతగా... ఈ సినిమాకే ఆమెకు ఉత్తమనటిగా జాతీయ అవార్డు కూడా వరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు.. ఇని ఉతరమ్​, నితమ్​ ఓరు వానమ్​, ఆకాశం, ఉల, పద్మని, కాపా సహా పలు చిత్రాలు చేస్తోంది.

Aparna Balamurali Child Hood Pic
అపర్ణ బాలమురళి
Aparna Balamurali Child Hood Pic
అపర్ణ బాలమురళి
Aparna Balamurali Child Hood Pic
అపర్ణ బాలమురళి

ఇదీ చూడండి: సన్నీలియోని-అమలపాల్​-కృతిశెట్టి హాట్ ​ట్రీట్​.. చూస్తే చూపు తిప్పుకోరంతే!

Last Updated : Sep 16, 2022, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.