ETV Bharat / entertainment

విజయ్​-అజిత్​ కాంబోలో మల్టీస్టారర్​.. దర్శకుడు ఎవరంటే? - అజిత్ విజయ్​ మల్టీస్టారర్​ సినిమా

తమిళ స్టార్ హీరోలు విజయ్​, అజిత్​తో కలిసి ఓ మల్టీస్టారర్​ సినిమా చేస్తానని అన్నారు దర్శకుడు వెంకట్​ ప్రభు. ఆ వివరాలు..

ajith vijay
అజిత్ విజయ్
author img

By

Published : Sep 27, 2022, 3:22 PM IST

తమిళ స్టార్ హీరోలు విజయ్​, అజిత్​తో కలిసి ఓ మల్టీస్టారర్​ సినిమా చేస్తానని అన్నారు దర్శకుడు వెంకట్​ ప్రభు. అయితే దీనికి వీరిద్దరు అంగీకరం తెలిపితేనే కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. లఘు చిత్రాల పోటీల్లో గెలుపొందిన వారికి చెన్నైలోని ఓ హోటల్‌లో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. జ్యూరి సభ్యులుగా దర్శకుడు వసంత్, శింబుదేవన్, వెంకట్‌ప్రభు తదితరులు వ్యవహరించారు. గెలుపొందిన వారికి అవార్డులు, ధ్రువపత్రాలను ప్రదానం చేశారు.

ఈ క్రమంలోనే ఆ కార్యక్రమంలో వెంకట్​ ప్రభు మాట్లాడుతూ.. తనకు తెలుగు భాష రాకపోయినా చిత్రం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఆ చిత్రంలో పలువురు తమిళ నటీనటులు నటిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఆయన నాగచైతన్యతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

సినిమాకు భాష ముఖ్యం కాదన్న దానికి దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్, ప్రభుదేవా ఉదాహరణ అని ప్రభు పేర్కొన్నారు. వాళ్లకి హిందీ తెలియకపోయినా బాలీవుడ్‌లో చిత్రాలు చేసి విజయం సాధించారని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా ఇంగ్లీష్​ సరిగ్గా తెలియకపోయినా బాలీవుడ్‌ వరకూ వెళ్తున్నారన్నారు. కాబట్టి సినిమాకు భాష ఆటంకం కాదన్నారు. ఇకపోతే షార్ట్‌ ఫిలింస్‌ చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. విజయ్, అజిత్‌ అంగీకరిస్తే వారితో మల్టీస్టారర్‌ చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మానాడు చిత్రంలో శింబును సాధారణంగా చూపించానన్నారు. అదే విధంగా వెందు తనిందదు కాడు చిత్రంలో దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ శింబును మంచి పాత్రలో చూపించారని అన్నారు.

ఇదీ చూడండి: ఆశా పారేఖ్​కు​ దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.