ETV Bharat / entertainment

జక్కన్న నయా ప్లాన్​.. మహేశ్​ కోసం రంగంలోకి ఐశ్వర్యరాయ్​! - ఐశ్వర్యరాయ్​ మహేశ్​బాబు సినిమా

Mahesh Rajamouli movie: మహేశ్​ బాబుతో చేయబోయే సినిమాలో అందాల తార ఐశ్వర్య రాయ్​ను భాగం చేయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారట! ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్​కు పండగనే చెప్పాలి.

mahesh aishwarya rai
మహేశ్​ ఐశ్వర్యరాయ్​
author img

By

Published : Jun 12, 2022, 12:51 PM IST

Mahesh Rajamouli movie: రాజమౌళి- మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమా.. పూర్తి స్క్రిప్టు సిద్ధమవకముందే ఎన్నో అంచనాలు పెంచేసింది. ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లోనే కాదు చిత్ర పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొంది. అడవి నేపథ్యంలో సాగే యాక్షన్‌ సినిమా అనే ఊహాగానాలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. రోజు ఈ చిత్రం గురించి రకరకాలు ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్​ను భాగం చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ప్రస్తుతం ఈ విషయమై దర్శకుడు జక్కన ఆలోచిస్తున్నారని తెలిసింది. త్వరలోనే సంప్రదింపులు జరిపి ఈ విషయమై స్పష్టతకు రావాలని అనుకుంటున్నారట! అంతకుముందు ఇటీవలే మహేశ్ సరసన శ్రద్ధాకపూర్​ను హీరోయిన్​గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మహేశ్​ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ భామల సందడి​ సినిమాకే హైలెట్​గా నిలస్తుంది. కాగా, వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయని సమాచారం. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యత ఉండే ఈ పాన్‌ ఇండియా సినిమాకు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. మరో విశేషమేమిటంటే.. సూపర్​స్టార్​ రజనీకాంత్​ తన తర్వాత సినిమాను నెల్సన్​ దిలీప్​కుమార్​ దర్శకత్వంలో నటిస్తున్నారు. సన్​పిక్చర్స్​ నిర్మిస్తోంది. ఇందులోనూ ఐశ్వర్య రాయ్​ నటించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇదీ చూడండి: టాప్​లో కోహ్లీ, ప్రియాంక.. ఆ తర్వాతి స్థానాల్లో ఎవరున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.