ETV Bharat / entertainment

పవర్​ ఎపిసోడ్​ రిలీజ్ డేట్​ ఫిక్స్..సంబరాల్లో పవన్ ఫ్యాన్స్..! - ఎన్​బీకే పవన్​ కల్యాణ్​ ఎపిసోడ్స్​

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్​స్టాపబుల్​ పవన్​ కల్యాణ్​ పవర్​ ఎపిసోడ్​ రిలీజ్​ డేట్​ను ఫిక్స్​ చేసింది ఆహా టీమ్​. రెండు భాగాల్లో విడుదలవ్వనున్న ఈ ఎపిసోడ్ మొదటి పార్ట్​ను ఎప్పుడు రిలీజ్​ చేయనున్నారంటే ??

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 1, 2023, 10:30 AM IST

Updated : Feb 1, 2023, 11:11 AM IST

నట సింహం బాలకృష్ణ ఎంట్రీతో ఓటీటీకే ఓ కొత్త కల వచ్చిందనే చెప్పాలి. దానికి నిదర్శనం తన అనస్టాపబుల్​ టాక్​ షో. రిలీజైన ప్రతి ఎపిసోడ్​ ఓ సెన్సేషన్​గా నిలుస్తోంది. వచ్చే ప్రతీ గెస్ట్​ కూడా ఓ ప్రత్యేకమే మునుపెన్నడూ ఎటువంటి ఎంటర్టైనింగ్​ టాక్​ షోలకు రాని కొంత మంది స్టార్స్​ ఈ షో కు వచ్చి అందరిని ఆశ్చర్య పరిచారు. అంతే కాకుండా ఈ షో కు సినీ ప్రముఖులతో పాటు రాజకీయా నేతలు కూడా రావడం విశేషం.

రీసెంట్​గా రిలీజైన ప్రభాస్​ ఎపిసోడ్​ ఓ బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచింది. పార్ట్ 1 రిలీజైనప్పుడు రోజున ఆహా సర్వర్లన్నీ ఒకే సారిగా డౌన్ అయ్యాయి. ఆ రేంజ్​లో అభిమానులు ఎదురు చూశారు మరి. ఇక ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎపిసోడ్​కు రెస్పాన్స్​ ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించగలం. అదే పవరస్టార్​ ఎపిసోడ్. ప్రభాస్​ ఎపిసోడ్​ తర్వాత మోస్ట్ అవెయిటింగ్​ ఎపిసోడ్​ ఇదే. అంతే కాకుండా ప్రోమో రిలీజ్​ కాక ముందు నుంచే ఈ ఎపిసోడ్​ కోసం ట్రెండ్స్​ సృష్టించారు పవర్​ అభిమానులు.

అయితే ప్రోమోలో బాలయ్య ఇంట్రెస్టింగ్​ ప్రశ్నలకు పవన్ కల్యాణ్ తనదైన సమాధానాలను ఇచ్చారు. దీంతో అభిమానులకు ఈ షో మీద మరింత ఆసక్తి పెరిగింది. అయితే సంక్రాంతికే రావాల్సిన ఈ ఎపిసోడ్​ ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్​ ఇంకొంత కాలం వెయిట్ చేయాలా అంటూ ఆందోళన పడ్డారు. కానీ వీటన్నింటికి ఫుల్​ స్టాప్ పెడుతూ పవన్ కల్యాణ్ షో విడుదల తేదీ ఖరారు చేసింది ఆహా టీమ్​.

ఫిబ్రవరి 2 కు అన్‌స్టాపబుల్ విత్ ఎన్​బీకే 2 లేటెస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్నట్లు ఆహా తన సోషల్ మీడియా హ్యాండిల్స్​లో అప్డేట్​ పోస్ట్​ చేసింది. అంతే ఇక ఫ్యాన్స్​ అప్పుడే సంబరాలు మొదలుపెట్టేశారు. బాహుబలి ఎపిసోడ్​ లాగే దీన్ని కూడా రెండు ఎపిసోడ్​లుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీన పార్ట్ 1 రాగా..తర్వాతి వారానికి పార్ట్ 2 విడుదల కానుంది. అయితే పవన్ ఎపిసోడ్ తర్వాత ఈ అన్​స్టాపబుల్ సీజన్ 2కు ఇక ముగుస్తుందా అన్న ప్రశ్న అభిమానుల్లో మొదలయ్యింది. ఇప్పుడైత సీజన్​2కు పవన్ ఎపిసోడ్స్ లాస్ట్ అని సమాచారం. ఆ తర్వాత మళ్లీ సీజన్ 3 వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Last Updated : Feb 1, 2023, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.