ETV Bharat / entertainment

'గేమ్​ ఛేంజర్'​ తర్వాత చెర్రీ​ లైనప్​ మామూలుగా లేదండోయ్​.. గ్యాప్​ లేకుండా! - గేమ్​ ఛేంజర్ మూవీ రిలీజ్​ డేట్

మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​ ప్రస్తుతం శంకర్​ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్​'​ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత మరికొన్ని చిత్రాలకు ఆయన సైన్​ చేశారట. అవేంటంటే..

ram charan
ram charan
author img

By

Published : Mar 29, 2023, 7:11 AM IST

'ఆర్ఆర్ఆర్' సినిమా బ్లాక్​బస్టర్ హిట్​తో టాలీవుడ్​ స్టార్​ హీరో రామ్ చరణ్​.. మెగా పవర్​ స్టార్​ కాస్త గ్లోబల్​ స్టార్​గా మారిపోయారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు మెస్మరైజ్​ అయిన అభిమానులు.. చరణ్​ పాత సినిమాలను ఇదే తరహాలో ఆదరిస్తున్నారు. ఇటీవలే ఆరెంజ్​ సినిమాకు వచ్చిన రెస్పాన్సే ఇందుకు ఉదాహరణ. ఆర్​ఆర్​ఆర్​ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆచార్యలో నటించినప్పటికీ ఆ సినిమా చెర్రీకి నిరాశే మిగిల్చింది.

ఆ తర్వాత ఆర్​ఆర్​ఆర్​కు అవార్డుల వెల్లువ కొనసాగడం వల్ల ఆ పనుల్లో బిజీ అయిపోయారు చరణ్​. ఇప్పుడు శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్' సినిమాలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కియారా హీరోయిన్​ పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ కూడా వచ్చేసింది.

మరోవైపు ఈ సినిమా షూట్​తో పాటు మరిన్ని చిత్రాలను లైన్​లో పెట్టేశారట చరణ్​. దీంతో త్వరలో మరింత బిజీ కానున్నారన్న మాట. తన 16వ సినిమా కోసం బుచ్చిబాబును డైరెక్టర్​గా ఎంచుకున్నారు చెర్రీ. మైత్రీ మూవీ మేకర్స్ సన్నిహితులైన సతీశ్​ ఈ సినిమాతో నిర్మాతగా మారనున్నారు. చరణ్​ 17వ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద రూపొందనుంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తున్నారన్న విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అప్పట్లో కన్నడ దర్శకుడు ప్రశాంత్​ నీల్​ శిష్యుడు డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో అయితే ఓ సినిమాకు చెర్రీ ఓకే చెప్పారట. ఈ బ్యానర్​పై తెరకెక్కనుంది ఆ సినిమానా కాదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక రామ్​ చరణ్ తన 18వ సినిమా 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రొడక్షన్​ బ్యానర్​ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్​లో రూపొందే అవకాశముందట. అయితే ఈ సినిమాకు కూడా ఎవరు డైరెక్టర్​ అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇలా ప్రస్తుతం చెర్రీ చేతి నిండా సినిమాలతో బిజీ కానున్నారు. 'ఆర్​ఆర్​ఆర్'​ తర్వాత రామ్​ చరణ్​ అంతర్జాతీయ స్థాయిలో పాపులర్​ అయిపోయారు. అభిమానులు సైతం ఆయన ఇకపై ఎటువంటి సినిమాలు తీయనున్నారన్న విషయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో చరణ్​ లైనప్​ కచ్చితంగా అందరిలోనూ ఆసక్తి రేపే అంశమే. ఆచార్య తర్వాత ఇన్ని సినిమాలకు సైన్​ చేసిన రామ్​ చరణ్​ మరింత ఫేమస్​​ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్​ అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.