ETV Bharat / entertainment

' హిట్‌ 2 కథతో శేష్‌ వద్దకు వెళ్లొద్దు.. మనోడు వేలు పెడతాడు' - hit 2 movie teaser

'హిట్‌ 1' ప్రశ్నలతో థ్రిల్‌ చేసిన అడివి శేష్..​ ఇప్పడు 'హిట్ 2'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని శైలేష్‌ కొలను తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్​ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలు పంచుకుంది చిత్ర యూనిట్.

adivi-sesh-sailesh-kolanus
హిట్‌ 2 కథతో శేష్‌ వద్దకు వెళ్లొద్దన్నారు
author img

By

Published : Nov 4, 2022, 6:42 AM IST

హిట్‌1 ప్రశ్నలతో థ్రిల్‌ చేస్తే.. హిట్‌2 భయపెట్టి థ్రిల్‌ చేస్తుందన్నారు అడివి శేష్‌. ఆయన కథానాయకుడిగా శైలేష్‌ కొలను తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే హిట్‌ . ది సెకండ్‌ కేస్‌.. అన్నది ఉపశీర్షిక. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో చిత్ర టీజర్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో అడివి శేష్‌ మాట్లాడుతూ.. 'నాకిష్టమైన హీరో నాని. గూఢచారి, ఎవరు సినిమాల ట్రైలర్స్‌ను తనే విడుదల చేశారు. ఓరోజు సడెన్‌గా వచ్చి నాతో ఒక హిట్‌ సినిమా నిర్మిస్తానన్నారు. అలా హిట్‌2 నా దగ్గరకు వచ్చింది. ఈ సినిమా చేయడానికి కొవిడ్‌ టైమ్‌లో చిత్ర బృందమంతా చాలా కష్టపడింది. చాలా గర్వంగా ఫీలవుతున్నా. సినిమా చాలా బాగుంటుంది. ఎంజాయ్‌ చేస్తారు. టీజర్‌ చూడగానే విలన్‌ వాయిస్‌ బాగా నచ్చింది. హిట్‌ వెర్స్‌లో విభిన్నమైన కోణాలున్నాయి. అందుకనే 'హిట్‌2' లో నటించాను. ఇందులో శైలేష్‌ నన్ను కొత్తగా చూపించాడు. మీనాక్షి చక్కటి ప్రతిభ ఉన్న నటి. బాంబే అమ్మాయిల్లా 'హాయ్‌ నమస్కారం వన్‌..టు..త్రీ..' అని చెప్పేసి కారవాన్‌ ఎక్కేసి వెళ్లిపోతుందనుకున్నా. కానీ, తను నమస్కారం చెప్పడంతో పాటు చాలా వరకు స్పీచ్‌ తెలుగులో నేర్చుకొని మరీ మాట్లాడింది. టీజర్‌ రిలీజ్‌కే ఇంత కష్టపడిందంటే.. సినిమా కోసం తనెంత కష్టపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు' అని అన్నారు.

'ఈ కథతో శేష్‌ దగ్గరకు వెళ్దామనుకుంటే వెళ్లొద్దు.. మనోడు వేలుపెడతాడు. అన్నీ తనే రాసేసుకుంటాడు' అన్నారు. దాంతో తొలి మీటింగ్‌ అప్పుడు కథ తనకి నచ్చుతుందా లేదా? అనుకున్నా. కానీ, తనకు కథ బాగా నచ్చింది. సెట్స్‌లో తనెంతో ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. కె.డి. అనే క్యారెక్టర్‌ ఎలా ఉండాలని అనుకున్నానో.. దానికంటే నాలుగైదు రెట్లు బాగానే చేసి చూపించాడు. హిట్‌ వెర్సెకి వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యమేసింది. ఈ హిట్‌ యూనివర్స్‌ని ఇంకా గొప్పగా చేయాలనే స్ఫూర్తిని ఇచ్చింది' అన్నారు దర్శకుడు శైలేష్‌ కొలను.

నిర్మాత ప్రశాంతి మాట్లాడుతూ.. హిట్‌2 ని తెరపై చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అన్నారు. ఈ చిత్రంలో నేను ఆర్య అనే పాత్రలో నటించా. శైలేష్‌ ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నా అంది నాయిక మీనాక్షి. ఈ కార్యక్రమంలో కోమలి ప్రసాద్‌, శ్రీనాథ్‌ మాగంటి, మణికందన్‌, గ్యారీ బి.హెచ్‌ తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.