Adivi Sesh G2 Movie : విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం యంగ్ హీరో అడివి శేష్ స్టైల్. ఇప్పటి వరకు పలు జానర్స్‌లో నటించి అభిమానుల మనసులు దోచుకున్న ఈ స్టార్ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ 'గూఢచారి 2' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ అనూహ్య సంఘటన ఎదురైంది. తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తానంటూ ఓ ఫ్యాన్ నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఆ ట్వీట్‌ను చూసిన శేష్.. తన స్టైల్లో ఆ ఫ్యాన్‌కు రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?
2018లో విడుదలైన 'గూఢచారి' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా శేష్‌కు బిగ్ హిట్ ఇచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా 'జీ 2' అనే మూవీ తెరకెక్కుతోంది.
వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే 'జీ 2'కు సంబంధించిన అప్‌డేట్‌లు ఇవ్వమంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అందులో భాగంగా ఓ నెటిజన్.. అడివి శేష్‌ను ట్యాగ్ చేస్తూ తాజాగా ట్వీట్ చేశారు. అప్‌డేట్ ఇవ్వక పోతే ఫిర్యాదు చేస్తానని అన్నారు.
"అన్నా 'గూఢచారి' గురించి అప్‌డేట్ ఇస్తావా లేదా? అప్‌డేట్ ఇవ్వకపోతే నీ మీద పోలీసులకు కంప్లైంట్ చేస్తా" అని ట్వీట్ చేశారు. దీనిపై అడివి శేష్ స్పందించారు. "హ్హహ్హహ్హ.. లవ్ యూ బ్రదర్. షూట్ కోసం రెడీ అవుతున్నాం. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం. 'గూఢచారి 2'ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన స్పై సినిమాను తీర్చిదిద్దడానికి అదే స్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టే ఇంత టైమ్ తీసుకోవాల్సి వస్తుంది" అని తెలిపారు.
-
Hahahaha ❤️ Love you brother. Prepping for shoot. Starting soon. Huge project. Massive film. Making a top notch spy film requires top notch effort. So taking time. #G2 #Goodachari2 https://t.co/avcW6kaCuq
— Adivi Sesh (@AdiviSesh) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hahahaha ❤️ Love you brother. Prepping for shoot. Starting soon. Huge project. Massive film. Making a top notch spy film requires top notch effort. So taking time. #G2 #Goodachari2 https://t.co/avcW6kaCuq
— Adivi Sesh (@AdiviSesh) November 24, 2023Hahahaha ❤️ Love you brother. Prepping for shoot. Starting soon. Huge project. Massive film. Making a top notch spy film requires top notch effort. So taking time. #G2 #Goodachari2 https://t.co/avcW6kaCuq
— Adivi Sesh (@AdiviSesh) November 24, 2023
G2 Movie Cast : 'గూఢచారి 2' సినిమాకు అడివి శేష్ స్వయంగా స్టోరీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు ఐదు దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. ఇక ఈ సినిమాలో శేష్ సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ బనితా సంధు ఈ సినిమాలో శేష్‌కు జోడీగా నటిస్తున్నారు.
మొన్న మహేశ్, అడవి శేష్.. నేడు నాగార్జున.. ఆ రేస్ కోసం వెయిటింగ్!
అడివి శేష్ వింత ట్వీట్.. అర్థం తెలియక నెటిజన్ల బుర్రలు బద్దలు!