Adipurush Collections : సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. రామాయణ ఇతిహాసాన్ని మోషన్ క్యాప్చర్ త్రీడీ టెక్నాలజీతో ఈ చిత్రం రూపొందింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీరామ చంద్రుడిగా ప్రభాస్.. జానకీ దేవిగా కృతి సనన్ నటించారు. అలాగే రావణుడుగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఒకవైపు అభిమానులు, ప్రేక్షకులు.. మరో వైపు ట్రేడ్ వర్గాలు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
అంచనాలకు తగ్గట్టుగానే
Adipurush Pre Bookings : 'ఆదిపురుష్'పై అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే ఇప్పుడు బుకింగ్స్ జరుగుతున్నాయి. 'బాహుబలి'తో పాన్ ఇండియా రికార్డులను షేక్ చేసిన ప్రభాస్ తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలతో ఫస్ట్ డే మంచి కలెక్షన్స్‌ను రాబట్టుకున్నారు. 'సాహో' అయితే హిందీలో వంద కోట్లకు పైగానే రాబట్టింది. ఇప్పుడు 'ఆదిపురుష్' వంతు వచ్చింది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Adipurush First Day Collections : సినీ బాక్సాఫీస్ విశ్లేషకుల అంచనాల మేరకు 'ఆదిపురుష్' సినిమా తొలి రోజున హిందీలో దాదాపు రూ. 30-32 కోట్ల మేరకు కలెక్షన్స్‌ను రాబట్టుకుంటుందట. తెలుగు సహా మిగిలిన తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఫస్ట్ డే రూ.60-70 కోట్ల వసూళ్లు వస్తాయని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు తొలిరోజే రూ.120-140 కోట్ల మేరకు నెట్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. అలా వస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ కావటం పక్కా అంటున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Adipurush Release Date : నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని భావించారు. రిలీజ్ డేట్ కూడా చేశారు. అయితే ఆ సందర్భంలో వచ్చిన ట్రైలర్ విమర్శలకు కేరాఫ్‌గా మారింది. దీంతో మేకర్స్ 'ఆదిపురుష్' రిలీజ్ డేట్‌ను వాయిదా వేసి వీఎఫ్‌ఎక్స్ వర్క్‌పై ఫోకస్ చేసి జూన్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">