ETV Bharat / entertainment

'ఆదిపురుష్‌' 3D టికెట్లు మరింత తగ్గింపు.. పూర్తి వివరాలివే - adipurush 3d tickets offer

Adipurush 3d ticket price : 'ఆది పురుష్' సినిమా 3డీ వెర్షన్​ టికెట్ ధర మరింత తగ్గిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఆ వివరాలు..

Adipurush 3d ticket price
'ఆదిపురుష్‌' 3D టికెట్లు మరింత తగ్గింపు.. పూర్తి వివరాలివే
author img

By

Published : Jun 25, 2023, 10:44 PM IST

Updated : Jun 26, 2023, 12:45 PM IST

Adipurush 3d ticket price : 'ఆదిపురుష్‌' మూవీటీమ్​ సినీ ప్రియులకు మరో శుభవార్త వినిపించింది. 3డీ వెర్షన్‌కు సంబంధించిన సినిమా టికెట్ల ధరను మరింత తగ్గించనున్నట్లు తెలిపింది. రూ. 112 (*షరతులు వర్తిస్తాయి) ప్రారంభ ధరతో విక్రయించనున్నట్టు తెలిపింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ చేసింది. ఈ ఆఫర్‌ సోమవారం నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇటీవలే ఈ నెల 22, 23న.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడు మినహా ఇతర రాష్ట్రాల్లో రూ. 150తో 3డీ వెర్షన్​ టిక్టెట్లను విక్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు రూ. 112 ఆఫర్‌తో టికెట్లను విక్రయించనున్నట్లు చిత్రబృందం తెలియజేసింది. రామాయణ ఇతిహాసాన్ని 3డీ వెర్షన్​లో అత్యధిక మంది చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఎడిటెడ్‌ వెర్షన్‌తో సినిమా ప్రదర్శితమవుతుందని మరోసారి గుర్తుచేసింది.

Adipurush dialogues : డైలాగ్స్​లో మార్పులు.. ఇక ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు, డైలాగులు.. మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు విమర్శించారు. అలా సోషల్​మీడియాలో వచ్చిన విమర్శలపై ఆ సినిమా డైలాగ్‌ రైటర్‌ మనోజ్ ముంతశిర్ శుక్లా కూడా స్పందించారు. ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పి డైలాగ్​లు కూడా మార్చారు. అభ్యంతరకరంగా ఉన్న వాటిని తొలగించి సినిమాను ఇటీవలే రీ-ఎడిట్ చేశారు.

Adipurush cast : రామాయణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజైంది. అయితే బాక్సాఫీస్​ వద్ద సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. అయినా మంచి వసూళ్లను సాధించింది. చిత్రంలో రాఘవుడిగా ప్రభాస్‌.. జానకిగా కృతి సనన్‌ నటించింది. సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్‌గా కనిపించారు. ఇక ఈ సినిమాకి సంగీతం ప్ర‌ధాన‌బ‌లం. జై శ్రీరామ్‌, శివోహం, ప్రియ‌మిథునం పాట‌లు, వాటి విజువల్స్​ సినిమాకి స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచాయి. అజ‌య్ - అతుల్‌ స‌మ‌కూర్చిన బాణీలు చాలా బాగున్నాయి. సంచిత్, అంకిత్ ద్వ‌యం నేప‌థ్య సంగీతం క‌ట్టిప‌డేసింది. కానీ సాగతీత సన్నివేశాలు, భావోద్వేగాలు కొర‌వ‌డ‌టం, కొన్ని పేలవ విజువల్స్​ సినిమాపై బాగా ఎఫెక్ట్​ చూపాయి.

అక్కడ నిఖిల్​ను పట్టుకున్న పోలీసులు!.. ఆ తర్వాత..
నిఖిల్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం యాక్షన్​ థ్రిల్లర్​ చిత్రం 'స్పై'. గ్యారీ బిహెచ్‌ దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జూన్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'స్పై' గురించి పలు విశేషాలపై చిత్ర బృందంతో యాంకర్‌ సుమ ముచ్చటించింది. ఈ సందర్భంగా జోర్డాన్‌ పోలీసు స్టేషన్‌లో తమకు ఎదురైన అనుభవాన్ని 'స్పై' టీమ్‌ పంచుకుంది. పోలీసులు తమను పట్టుకున్నట్లు.. ఆ తర్వాత గూగుల్​లో సెర్చ్ చేసి.. వదిలిపెట్టినట్లు తెలిపింది.

Last Updated : Jun 26, 2023, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.