ETV Bharat / entertainment

Actress Renjusha Menon Died : ప్రముఖ​ నటి అనుమానాస్పద మృతి.. కారణం అదేనా? - కేరళ బుల్లితెర నటి రెంజూషా మేనన్ మృతి

Actress Renjusha Menon Died : ప్రముఖ సీరియల్​ నటి రెంజూషా మేనన్ (35) మృతి చెందారు. తిరువనంతపురంలోని ఆమె ఫ్లాట్​లో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Actress Renjusha Menon Died
Actress Renjusha Menon Died
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 5:31 PM IST

Updated : Oct 30, 2023, 8:13 PM IST

Actress Renjusha Menon Died : కేరళకు చెందిన ప్రముఖ బుల్లితెర నటి రెంజూషా మేనన్ ​(35) మరణించారు. తిరువనంతపురంలోని శ్రీకార్యం కరియమ్‌లోని ఓ ఫ్లాట్​లో భర్తతో కలిసి నివాసముంటున్న ఆమె.. సోమవారం అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రపోయిన రెంజూషా మేనన్.. సోమవారం ఉదయమైనా తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. తలుపులు పగులగొట్టి చూడగా శవమై కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సందేహించాల్సిన వస్తువులేమీ ఘటన స్థలంలో దొరకలేదని.. అయితే నటి మృతికి ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శవపంచనామా నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Actress Renjusha Menon Died
మలయాళ నటి రెంజూషా మేనన్

యాంకర్​గా మొదలుపెట్టి నటిగా మారి
Actress Renjusha Menon Serial : కొచ్చికి చెందిన రెంజూషా టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. వ్యాఖ్యాతగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆమె.. పలు ధారావాహికల్లో నటించారు. ఇప్పటివరకు ఆమె.. 20కి పైగా సీరియల్స్​లో నటించారు. సినిమాల్లోనూ సహాయనటి పాత్రలు పోషించారు. 'సిటీ ఆఫ్‌ గాడ్‌', 'బాంబే మార్చ్‌', 'వన్‌ వే టికెట్‌' వంటి ప్రాజెక్ట్‌లు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'మేరికుండోరు కుంజద్', 'లిసమ్మస్ హౌస్', 'తలపావు', 'వధ్యార్' వంటి అనేక చిత్రాలలో కూడా నటించి ఆడియెన్స్​ను మెప్పించారు. కెరీర్‌లో రాణిస్తున్న సమయంలోనే ఓ నటుడిని ఆమె వివాహం చేసుకున్నారు. ఆమె పలు ధారావాహికలకు సైతం నిర్మాతగా వ్యవహరించారు.

ఇటీవల మరో నటి మృతి
Shopping Mall Actress Sindhu Passed Away : ఫీల్ గుడ్​లవ్​ స్టోరీ 'షాపింగ్ మాల్' సినిమా సహాయనటి సింధు (44) ఇటీవల కన్నుమూశారు. ఆగస్టు 7న ఉదయం 2.15 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 2020 నుంచి రొమ్ము క్యాన్సర్​ వ్యాధితో బాధపడుతున్న ఈమె.. చెన్నై వలసరవక్కమ్​లోని నివాసంలో లోకాన్ని విడిచారు. ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతున్న నటి సింధు.. కొద్ది రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకున్నారు. ​సింధు మృతి పట్ల తోటి నటీనటులు ఆమెకు సంతాపం ప్రకటించారు.

బాలీవుడ్​లో విషాదం.. షూటింగ్ సెట్​లో టీవీ నటి ఆత్మహత్య

Vaibhavi Upadhyaya Car Accident : రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి మృతి!

Last Updated : Oct 30, 2023, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.