ETV Bharat / entertainment

సోషల్​మీడియాలో మళ్లీ ప్రియమణి ట్రెండింగ్​.. ఆ విషయం నిజమేనా? - నటి ప్రియమణి డివర్స్​

సోషల్​మీడియాలో నటి ప్రియమణి పేరు మళ్లీ తెగ ట్రెండ్​ అవుతోంది. ప్రస్తుతం ఆమె గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే?

priyamani divorce
ప్రియమణి డివర్స్​
author img

By

Published : Oct 20, 2022, 3:20 PM IST

ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు వంటి విషయాలు కాస్త ఎక్కువగానే వింటుంటాం. అయితే ఈ మధ్య కాలంలో చిత్రసీమలో ముఖ్యంగా విడాకుల విషయాలు తరచుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చై-సామ్‌, ధనుష్‌-ఐశ్వర్యల విడాకుల అంశం హాట్‌టాపిక్‌గానే ఉండగానే.. కోలీవుడ్​ హీరో విజయ్‌ ఆంటోనీ కూడా తన భార్యకు డివోర్స్​ ఇవ్వనున్నట్లు ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. ఈ విషయంపై క్లారిటీ ఇంకా రాకుండానే.. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్‌ ప్రియమణి కూడా విడాకుల​ విషయంలో మళ్లీ వార్తల్లో నిలిచింది. సోషల్‌ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఆమె స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.

అంతకుముందు కొంతకాలం క్రితం కూడా.. గొడవల కారణంగా ప్రియమణి, ఆమె భర్త వేర్వేరుగా ఉంటున్నట్లు కథనాలు వచ్చాయి. వీళ్లిద్దరు డివోర్స్​ తీసుకోవాలని భావించినట్లు అంతా మాట్లాడుకున్నారు. కానీ వీటిని అప్పుడే ప్రియమణి టీమ్​ కొట్టిపారేసింది. అలాగే రీసెంట్‌గా 'రాకెట్రీ' సినిమా సక్సెస్‌ మీట్‌ పార్టీకి కూడా ప్రియమణి తన భర్తతో కలిసి హాజరై ఆ పుకార్లకు చెక్​ పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్‌ మీడియాలో పంచుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ ప్రియమణి డివర్స్​ విషయం తెరపైకి వచ్చింది. ఈమె పేరు సోషల్​మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

కాగా ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ అనే వ్యాపార‌వేత్త‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ముస్తాఫాకు ఇది రెండో పెళ్లి. ఇదివరకే అయేషా అనే మహిళతో అతడికి వివాహం జరిగింది. ఒకనొక సమయంలో ముస్తాఫాపై అయేషా ఆరోపణలు చేసినా ప్రియమణి ఆ సమయంలో భర్తకు అండగా నిలిచింది. ఇప్పటికీ ఆమె ఇన్‌స్టా ఐడీ భర్త పేరుతో కలిపి.. ప్రియమణి రాజ్‌ అనే ఉంది. దీంతో ఇప్పటికైనా ఈ పుకార్లకి ఫుల్‌స్టాప్‌ పడుతుందేమో చూడాలి.

ఇదీ చూడండి: తిరుగులేని 'కాంతారా'.. కలెక్షన్లలో నయా రికార్డు.. కేజీఎఫ్​ తర్వాత..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.