ETV Bharat / entertainment

ఉరేసుకుని యువ నటి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? - తమిళనాడు వార్తలు

పలు చిత్రాల్లో నటించిన యువ నటి దీప.. తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న దీప.. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు.

Actress Deepa Suicide
Actress Deepa Suicide
author img

By

Published : Sep 18, 2022, 3:42 PM IST

Actress Deepa Suicide: చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కోలీవుడ్‌కు చెందిన యువ నటి దీప అలియాస్‌ పౌలిన్‌(29) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని విరుగంబాక్కంలోని ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో ఉంటున్న దీప.. శనివారం తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న దీప.. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని స్నేహితులు చెబుతున్నారు.

young actress suicide
దీప

శనివారం దీపకు ఆమె కుటుంబసభ్యులు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె స్నేహితుడు ఫ్లాట్‌కి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి, మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో తన చావుకు ఎవరు కారణం కాదని చెబుతూనే.. జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా అని రాసుకొచ్చింది.

young actress suicide
దీప

పలు తమిళ సినిమాల్లో సహాయ నటిగా అలరించింది దీప. చిన్న పాత్రలు పోషించినా.. తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం హీరో విశాల్ నటించిన 'తుప్పరివాలన్' చిత్రంలో దీప నటిస్తోంది. నాజర్ నటించిన 'వైదా' చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

ఇవీ చదవండి: మరో పాన్​ ఇండియా మూవీలో 'లెజెండ్​ శరవణన్​'!.. ఈ సారి బడ్జెట్​ ఎంతో?

సామ్​కు జోడీగా 'శాకుంతలం'లో ఆ స్టార్​ హీరో.. ఫస్ట్​ లుక్​ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.