ETV Bharat / entertainment

మళ్లీ తీవ్రంగా గాయపడ్డ స్టార్ హీరో.. ఆందోళనలో అభిమానులు - గాయపడిన నటుడు విశాల్​

కోలీవుడ్‌ స్టార్ హీరో విశాల్‌ మరోసారి గాయపడ్డారు. తన తదుపరి సినిమా 'మార్క్‌ ఆంటోనీ' చిత్రీకరణలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Actor Vishal injured in sets
నటుడు విశాల్​కు గాయం
author img

By

Published : Aug 11, 2022, 10:19 AM IST

Actor Vishal injured in sets: కోలీవుడ్‌ నటుడు విశాల్‌కు గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. తన తదుపరి సినిమా 'మార్క్‌ ఆంటోనీ' చిత్రీకరణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సినిమాలోని కీలక ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రథమ చికిత్స అనంతరం విశాల్‌ షూట్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు.

విశాల్‌కు గాయాలు కావడంతో ‘మార్క్‌ ఆంటోనీ’ షూట్‌ నిలిపివేశారు. సోషల్‌మీడియా వేదికగా ఈ వార్తలు బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక, సినిమాల కోసం విశాల్ ఎలాంటి రిస్క్‌లనైనా తీసుకోవడానికి ముందుంటారు. గతంలోనూ ఆయన పలు సినిమాల షూటింగుల్లో గాయాలపాలయ్యారు. ఇటీవల ‘లాఠీ’ షూట్‌లోనూ ఆయనకు పలుమార్లు గాయాలయ్యాయి.

ఇదీ చూడండి: 'నితిన్​తో అదే ఇబ్బంది.. డైలాగ్​ చెప్పడమూ కష్టమే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.