Vijayakanth Discharged from Hospital : ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పూర్తిగా కోలుకున్నారు. చెన్నైలోని పైవేటు ఆస్పత్రి నుంచి సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు డీఎండీకే పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ విషయం తెలియడం వల్ల విజయ్‌కాంత్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
-
"தேமுதிக தலைவர் விஜயகாந்த் வீடு திரும்பினார்"#etvbharattamil #vijayakanth #dmdk pic.twitter.com/PBbcIdMkff
— ETVBharat Tamilnadu (@ETVBharatTN) December 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"தேமுதிக தலைவர் விஜயகாந்த் வீடு திரும்பினார்"#etvbharattamil #vijayakanth #dmdk pic.twitter.com/PBbcIdMkff
— ETVBharat Tamilnadu (@ETVBharatTN) December 11, 2023"தேமுதிக தலைவர் விஜயகாந்த் வீடு திரும்பினார்"#etvbharattamil #vijayakanth #dmdk pic.twitter.com/PBbcIdMkff
— ETVBharat Tamilnadu (@ETVBharatTN) December 11, 2023
Vijayakanth Health Satus : శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం వల్ల కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను ఇటీవల ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షల తర్వాత మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆయన పూర్తిగా కోలుకోవడం వల్ల సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డయాబెటిస్ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లను తొలగించారు. అనారోగ్య కారణాలతో విజయ్‌కాంత్ కొంత కాలంగా సభల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
Vijayakanth Health Latest News : ఇటీవల విజయ్‌కాంత్ ఆరోగ్యానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చెన్నైలోని ఎమ్ఐఓటీ ఆస్పత్రి స్పందించి విజయ్‌కాంత్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలిపింది. విజయ్‌కాంత్ కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్యం ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా వివరాలు వెల్లడించారు.
Vijayakanth Movies List In Telugu : 'ఇనిక్కుం ఇలామై' అనే సినిమాతో నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు విజయ్‌కాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఎన్నో ఏళ్లపాటు సినీ అభిమానులను అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు నిరాశపరిచానా ఆ తర్వాత విజయాలు అందుకున్నారు. 100వ చిత్రం 'కెప్టెన్ ప్రభాకర్' విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. మరోవైపు విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడం వల్ల టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు.
'విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు- అవన్నీ పుకార్లే, మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్'