ETV Bharat / entertainment

ఆరుపదుల వయసులోనూ అదరగొడుతున్న స్టార్​ హీరో.. 25 సినిమాలతో ఫుల్ బిజీ - శరత్​కుమార్ సినిమాలు

తాజాగా పొన్నియన్​ సెల్వన్​లో ఓ కీలక పాత్ర పోషించి ట్రైలర్​లోనే అందరి చేత ఔరా అనిపించిన తమిళ హీరో శరత్​కుమార్ ఇకపై మరింత బిజీ కానున్నారు. ఎందుకంటే..

Actor R Sarath Kumar Upcoming Projects
Actor R Sarath Kumar Upcoming Projects
author img

By

Published : Sep 29, 2022, 11:01 AM IST

Updated : Sep 29, 2022, 11:07 AM IST

తమిళంలో అగ్ర కథానాయకుడైన శరత్​కుమార్​ అంటే సినీ ప్రపంచంలో తెలియనని వారుండరు. తన విలక్షణ నటనతో తండ్రిగా, అన్నగా, అమ్మాయిల మనసులు దోచే హీరోగా, ఇలా ఎలాంటి పాత్ర ఇచ్చిన ఇట్టే ఒదిగిపోతారు. కోలీవుడ్​లో సుప్రీం స్టార్​గా పేరు తెచ్చుకున్న శరత్​కుమార్​ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఉత్సాహంగా ఉంటారు. ఆరుపదుల వయసులోనూ యంగ్​ అండ్​ డైనమిక్​గా నేటి హీరోలకు పోటీగా నటిస్తుంటారు.

తాజాగా పొన్నియన్​ సెల్వన్​-Iలో ఓ కీలక పాత్ర పోషించారు శరత్​ కుమార్​. అటు తమిళంలో ఇటు తెలుగులోనే కాదు బీటౌన్​లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇంతటి బిజీ స్టార్​కి ఇప్పుడు కాల్​షీట్​లో డేట్స్​ ఖాళీ లేవట.. దానికి కారణం ఆయన ఇంకొన్ని ప్రాజెక్టుల్లో నటించడమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు ఇప్పుడు ఆయన లిస్ట్​లో ఉన్నాయి. త్వరలో పట్టాలెక్కనున్న పెద్ద ప్రాజెక్టులన్నీ ఈ హీరో కాల్షీట్​లో డేట్స్​ ఫిక్స్​ చేసుకున్నాయి. తెలుగు తమిళంలోనే కాకుండా హిందీలోనూ పలు చిత్రాలు నటించనున్నారు.

Actor R Sarath Kumar Upcoming Projects
శరత్​ కుమార్​ అప్​కమింగ్​ ప్రాజెక్ట్స్​

తమిళ హీరో విజయ్​ అప్​కమింగ్​ మూవీ 'వారిసు'లోనూ ఓ కీలక పాత్ర చేయనున్నారు. అంతేకాదు మమ్ముట్టి, నాగ చైతన్య, రాఘవ లారెన్స్​ లాంటి కథానాయకుల నయా ప్రాజెక్టుల్లోనూ శరత్​కుమార్​ నటించనున్నారు. భార్య రాధిక, తనయ వరలక్ష్మీతో ఓ అప్​కమింగ్​ ప్రాజెక్ట్​ మీద సైన్​ చేశారు.

ఇదీ చదవండి : తిరుపతిలో 'భారతీయుడు2'.. చైతూతో ఢీ అంటున్న అగ్ర కథానాయకుడు!

రూ.1000 కోట్ల రెమ్యునరేషన్​.. సల్మాన్​ ఖాన్​ రియాక్షన్​ ఏంటంటే?

Last Updated : Sep 29, 2022, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.