ETV Bharat / entertainment

ఆమె సపోర్ట్​తోనే ఇంతదూరం వచ్చా: ఈగ విలన్​ కిచ్చా సుదీప్​.. - కుటుంబ సభ్యులకు స్పెషల్​ థ్యాంక్స్ కిచ్చా సుదీప్

'ఈగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయిన నటుడు కిచ్చా సుదీప్​ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 28 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆయన భార్య ప్రియ సుదీప్​కు స్పెషల్​గా థ్యాంక్స్​ చెప్పారు.

Kiccha Sudeep and priya sudeep
Kiccha Sudeep and priya sudeep
author img

By

Published : Feb 1, 2023, 10:54 PM IST

Updated : Feb 2, 2023, 6:32 AM IST

నటుడిగా 28 ఏళ్ల తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న కన్నడ నటుడు కిచ్చా సుదీప్​ తాజాగా ట్విట్టర్​లో పోస్టు చేశారు. ఇందులో ముఖ్యంగా తన సతీమణి ప్రియ సుదీప్​ చేసిన ఎన్నో త్యాగాల వల్లే తాను నటుడిగా ఇంత దూరం ప్రయాణించగలిగానని సుదీప్‌ అన్నారు. అందుకు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు చెబుతూ వరుస ట్వీట్లు చేశారు.

'28 ఏళ్ల నా సినీ ప్రయాణానికి తొలి అడుగు ఇదే రోజున పడింది. నా సతీమణి ప్రియా సుదీప్‌ చేసిన ఎన్నో త్యాగాల వల్లే ఇది సాధ్యమైంది. ఆమె సహకారం లేకపోతే నేను ఇంత దూరం ప్రయాణం చేసేవాడిని కాదు. ప్రియా.. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. నన్ను నాలా ఉంచి, నా ప్రయాణాన్ని గౌరవించినందుకు నీకు ఎన్నో సందర్భాల్లో కృతజ్ఞతలు చెప్పాలనుకుని చెప్పలేకపోయాను. నా విషయంలో నువ్వు చేసిన ప్రతిదానికి ధన్యవాదాలు. అలాగే, విషయం ఏదైనా సరే.. తన అభిప్రాయాన్ని బయటపెట్టే నా కుమార్తె శాన్వీకి, నాకు ఈ జీవితాన్నిచ్చిన నా తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని సుదీప్‌ రాసుకొచ్చారు.

సీరియల్‌ ఆర్టిస్ట్​గా తన కెరీర్‌ మొదలుపెట్టిన సుదీప్‌ 'తాయవ్వ'తో వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆయన సహాయ నటుడిగా కనిపించారు. 'స్పర్శ' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ సినిమాల్లోనూ ఆయన అలరించారు. 'ఈగ' చిత్రంతో తెలుగువారికీ మరింత దగ్గరయ్యారు. ఇటీవల ఆయన నటించిన 'విక్రాంత్‌ రోణ'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

Last Updated : Feb 2, 2023, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.