ETV Bharat / entertainment

బనియన్​, షార్ట్​తో పెళ్లి మండపానికి ఆమిర్ అల్లుడు- 8 కి.మీ జాగింగ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 10:22 PM IST

Updated : Jan 3, 2024, 10:40 PM IST

Aamir Khan Daughter Wedding: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం బుధవారం (జనవరి 3)న గ్రాండ్​గా జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో ఓ వింత సంఘటన జరిగింది.

Aamir Khan Daughter Wedding
Aamir Khan Daughter Wedding

Aamir Khan Daughter Wedding: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన కుమార్తె ఐరా ఖాన్​ వివాహం ఫిట్​నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో నేడు (జనవరి 3న) ముంబయి బాంద్రాలోని ఓ స్టార్ హోటల్​లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే హల్దీ, సంగీత్ ఈవెంట్​లు కంప్లీట్ చేసుకున్న ఈ జంట పెళ్లిపీటలెక్కే ముందు ఓ వింత సంఘటన జరిగింది.

అయితే ఏ వరుడైనా గుర్రపు బండిపైనో, కారులోనో పెళ్లి మండపానికి వస్తారు. కానీ, ఆమిర్ ఖాన్​ అల్లుడు నుపుర్ శిఖరే వినూత్నంగా పెళ్లి మండపానికి చేరుకున్నారు. జాగింగ్ ఔట్​ఫిట్ (వెస్ట్ అండ్ షార్ట్)​ ధరించిన నపూర్, ముంబయి శాంటా క్రూజ్ నుంచి బాంద్రా పెళ్లి మండపానికి దాదాపు 8 కిలోమీటర్లు రన్నింగ్ చేసుకుంటూ వెళ్లారు. దీంతో స్థానికంగా అందరూ ఆశ్చర్యపోయారు. అలా పరిగెత్తుకుంటూ మండపానికి చేరుకున్న నుపుర్​ను హీరో ఆమిర్ ఖాన్ హగ్​ చేసుకొని ఆయనకు వెల్​కమ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. అయితే నుపుర్ ప్రొఫెషనల్​గా ఫిట్​నెస్ ట్రైనర్​ కాబట్టి అలా డిఫరెంట్​గా వచ్చి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Ira Khan Nupur Shikhare Wedding:నుపుర్ శిఖరే, ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ పర్సనల్ ఫిట్​నెస్ ట్రైనర్. అలా వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. నెమ్మదిగా స్నేహం కాస్త ప్రేమగా మారింది. చాలా రోజులు ఈ జంట రిలేషన్​షిప్​లో ఉంది. వీరి రిలేషన్​షిప్​ను అఫీషియల్​గా ప్రకటించిన తర్వాత గతేడాది ఐరా- నుపుర్​కు ఎంగేజ్​మెంట్ జరిగింది. కాగా బుధవారం మహారాష్ట్ర సంప్రదాయంలో పలువురు అతిథుల సమక్షంలో గ్రాండ్​గా జరగింది. వచ్చే వారంలో దిల్లీ, జయపురలో రెండుసార్లు రిసెప్షన్ వేడుక జరగనుందట. ఈ వేడుకకు బాలీవుడ్​కు సంబంధించిన పలువురు సెలెబ్రిటీలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Aamir Khan Reena Dutta: ఆమిర్ ఖాన్- రీనా దత్త దంపతుల కుమార్తె ఐరా ఖాన్. రీనా దత్త ఆమిర్ ఖాన్ మాజీ భార్య. రీనా దత్త బాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాత. ఆమె ఆమిర్​ ఖాన్ బ్లాక్​బస్టర్ ఫిల్మ్​ 'లగాన్' సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

వరదల్లో చిక్కుకున్న హీరోలు ఆమిర్ ఖాన్, విష్ణు విశాల్- అతికష్టం మీద బయటపడ్డారిలా!

Aamir Khan New Movie : ఆమిర్​ ఈజ్​ బ్యాక్​.. 'లాల్​ సింగ్​ చడ్డా' తర్వాత సొంత బ్యానర్​లో మరో సినిమా..

Last Updated : Jan 3, 2024, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.