ETV Bharat / entertainment

69th National Film Awards ceremony : రాష్టపతి చేతుల మీదగా అవార్డును అందుకున్న అల్లు అర్జున్​.. ఎమోషనల్​ అయిన వహీదా రెహమాన్​ - నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం

69th National Film Awards ceremony : దిల్లీ వేదికగా నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​తో పాటు పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు అవార్డులను అందుకున్నారు.

69th National Film Awards ceremony
69th National Film Awards ceremony
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 4:12 PM IST

Updated : Oct 17, 2023, 4:50 PM IST

69th National Film Awards ceremony : నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో సాగిన ఈ వేడుకలో వివిధ కేటగిరీల్లో అవార్డులు సాధించిన నటీ నటులను ఈ వేదికగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ నటుడిగా ఎంపికైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదగా అందుకున్నారు. 'పుష్ప' చిత్రానికిగాను ఆయన ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈయనతో పాటు ఆలియా భట్​, కృతి సనన్​, ఎంఎం కీరవాణి, శ్రేయ ఘోషల్​ రాజమౌళి లాంటి ప్రముఖులు కూడా రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డులు అందుకున్నారు.

మరోవైపు ఉత్తమ తెలుగు చిత్రం 'ఉప్పెన'కుగాను చిత్ర నిర్మాత నవీన్​ యెర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సనా కూడా అవార్డును అందుకున్నారు. ఇక ఉత్తమ విమర్శకుడిగా ఎంపికైన తెలుగు సాహితివేత్త పురుషోత్తమాచార్యులు కూడా ఇదే వేదికగా అవార్డును అందుకున్నారు. 'చార్లి 777' సినిమాకు గాను కన్నడ నటుడు రక్షిత్​ శెట్టి, 'కొండ పొలం' సినిమాకుగాను లిరిసిస్ట్​ చంద్రబోస్​, 'పుష్ప' సినిమాకు గాను మ్యూజిక్​ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ జాతీయ అవార్డులను​ అందుకున్నారు.

ఇక ఈ వేదికపై 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాకు అవార్డుల పంట పండింది. స్టంట్​ కొరియోగ్రాఫర్​ కింగ్ సోలమన్​, డ్యాన్స్​ కొరియోగ్రఫర్​ ప్రేమ్ రక్షిత్​, స్పెషల్ ఎఫెక్ట్స్​ క్రియేటర్​ శ్రీనివాస్​, బెస్ట్​ బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​కుగాను మ్యూజిక్​ డైరెక్టర్​ ఎం ఎం కీరవాణి , బెస్ట్ ప్లే బ్యాక్​ సింగర్​గా కాలభైరవ అవార్డులు అందుకున్నారు. అంతే కాకుండా బెస్ట్ పాపులర్​ సినిమా కేటగిరిలో ఎంపికైన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాకుగాను దర్శక ధీరుడు రాజమౌళి స్పెషల్​ అవార్డును అందుకున్నారు.

'షేర్​షా' సినిమాకుగాను దర్శక నిర్మాత కరణ్​ జోహర్​, విష్ణువర్దన్​, మిమి సినిమాకు గాను పంకజ్​ త్రిపాఠి, ది కశ్మీర్​ ఫైల్స్​ సినిమాకుగాను పల్లవి జోషి, రాకెట్రీ సినిమాకు గానూ నటుడు ఆర్ మాధవన్ అవార్డులను అందుకున్నారు.

వహీదా రెహమాన్​కు దాదా సాహెబ్​ అవార్డు.. నటి ఎమోషనల్​..
దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డును సీనియర్ నటి వహీదా వహీదా రెహమాన్‌ అందుకున్నారు. స్టాండింగ్​ ఓవేషన్​ నడుమ ఆమెకు రాష్ట్రపతి ఈ అవార్డును అందించారు. దీంతో నటి భావోద్వేగానికి గురయ్యారు.

Last Updated : Oct 17, 2023, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.