ETV Bharat / elections

ఆదివాసీల చేతిలోనే ఆదిలాబాద్ అభ్యర్థి భవిష్యత్ - 2019 elections

పార్లమెంటు ఎన్నికలు జాతీయ పార్టీలకే అనుకూలమనే ధీమాతో హస్తం, కమలం...అభివృద్ధి మంత్రంతో కారు ఆదిలాబాద్ లోక్​సభ పోరులో తలపడుతున్నాయి. 11మంది బరిలో ఉన్నప్పటికీ...ఈ మూడు పార్టీల మధ్యే పోటీ కనిపిస్తోంది.

ఆదిలాబాద్​లో ఆదివాసీ, గిరిజన పోరు
author img

By

Published : Apr 6, 2019, 2:12 PM IST

పోలింగ్​కు సమయం దగ్గర పడుతుండగా...పదునైన విమర్శనాస్త్రాలతో అభ్యర్థులు స్వరం పెంచుతున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలతో ఆదిలాబాద్​ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. సిట్టింగ్​ను నిలుపుకునేందుకు తెరాస ఆరాటపడుతుండగా...నేతల వలసలు అధిగమించి విజయాన్ని అందుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్...ఆదివాసీ ఉద్యమ నినాదంతో భాజపా ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ఆదిలాబాద్​లో ఆదివాసీ, గిరిజన పోరు

మోదీపైనే ఆశలు

ఆదివాసీ ఉద్యమాన్ని రగిలించి ప్రభుత్వంలో కదలిక తెచ్చి భాజపా అభ్యర్థి సోయం బాపూరావు మోదీ ఇమేజ్​పైనే ఆశలు పెట్టుకున్నారు. యువ ఓటర్లే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా...ప్రధాని మోదీ రావాలంటూ పార్టీ నేతలు, అభిమానులు చేస్తున్న ప్రచారం బాపూరావుకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. స్థానిక, జాతీయ పరిస్థితుల దృష్ట్యా భాజపా గెలిచే సూచనలున్నట్లు విశ్లేషకుల అంచనా.

అభివృద్ధి మంత్రం

రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు సాధించలేకపోయినందున...ఈసారి అత్యధికంగా తెరాస ఎంపీలను గెలిపించాలని కోరుతున్నారు. 16 స్థానాల్లో గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొస్తామని అభ్యర్థి నగేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నగేష్​పై నేతలు అసంతృప్తి ఉన్నప్పటికీ...అధినేత ఆదేశాలతో అందరు ప్రచారంలో పాల్గొంటున్నారు.

చీలికపై కాంగ్రెస్ ధీమా

ఆదివాసీ ఓట్ల చీలికపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. తెరాస, భాజపా అభ్యర్థులిద్దరూ ఆదివాసీలే అయినందున...లంబాడీల ఓట్లు గుంపగుత్తుగా రమేష్​ రాఠోడ్​కే పడతాయని ఆశిస్తున్నారు. మైనార్టీలు కూడా కాంగ్రెస్​ వైపే మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే హస్తం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్​ రెడ్డి గెలుపు శ్రేణులకు నూతనోత్తేజాన్ని తీసుకొచ్చిందని నేతలు పేర్కొంటున్నారు.

ఇవీ చూడండి: లష్కర్​లో పట్టు కోసం పార్టీల ప్రయత్నాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.