ETV Bharat / elections

దిగ్గజాలు లేని పోరులో గెలుపు ఎవరిది?

తమిళనాడు... ఒకప్పుడు ప్రతీకార రాజకీయాలకు పెట్టింది పేరు. అగ్రనేతలు జయలలిత, కరుణానిధి మరణం తర్వాత పరిస్థితి మారింది. అక్కడి రాజకీయ ముఖచిత్రం... పార్టీల అస్తిత్వ పోరాటంగా మారిపోయింది. చావోరేవో అన్నట్లు సాగుతున్న పోటీలో విజేత ఎవరన్నది ఆసక్తికరం.

తమిళ రాజకీయాలు
author img

By

Published : Apr 13, 2019, 1:59 PM IST

తమిళ రాజకీయాలు

తమిళనాట దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్యే పోటీ. రాష్ట్ర రాజకీయాలపై ద్రవిడ దిగ్గజాలు జయలలిత, కరుణానిధిది చెరగని ముద్ర. వీరిద్దరి అస్తమయం తర్వాత ఆ స్థాయి నాయకులెవరన్నది ప్రశ్నగానే మిగిలింది.

"అమ్మ మమ్మల్ని ముందుకు నడిపించారు. 47 ఏళ్ల ఆమె రాజకీయ జీవితంలో 27 ఏళ్లు అన్నాడీఎంకేను అధికారంలో కూర్చోబెట్టారు."
-ఆర్​ఎం బాబు మురుగవేల్, అన్నాడీఎంకే అధికార ప్రతినిధి

"కరుణానిధి మరణం మానసికంగా ఎంతో నష్టం. కానీ ప్రజాస్వామ్య విధులు నిర్వహించటం పార్టీ కార్యకర్తలుగా మా ముందున్న బాధ్యత."
-కేఎస్ రాధాకృష్ణన్​, డీఎంకే సీనియర్ నేత

2014 పరిస్థితులకు భిన్నంగా?

గత లోక్​సభ ఎన్నికల్లో 39 స్థానాల్లో 37 గెలుచుకుంది అన్నాడీఎంకే. భాజపా, పీఎంకే చెరొకటి గెలిచాయి. ఈ పార్టీలన్నీ ఎన్డీఏ భాగస్వాములే. డీఎంకే సహా యూపీఏలో ఏ పార్టీ ఒక్క సీటైనా గెలుచుకోలేక చతికిలబడ్డాయి.

ఇప్పుడు తిరిగి పుంజుకునేందుకు స్టాలిన్​ సేనకు ఒకేసారి 2 అవకాశాలు వచ్చాయి. ఏప్రిల్​ 18న లోక్​సభతో పాటు 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగున్నాయి. వీటిని కైవసం చేసుకోగలిగితే డీఎంకేకు చెన్నై పీఠం దక్కడం ఖాయమే. ఈ ఎన్నికల ఫలితాలు 2021 అసెంబ్లీ సమరానికి ముందు ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షే.

జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ స్థాయి వ్యూహాలు, ప్రచారం ఎక్కడా కనిపించటం లేదు. అయినా... విజయంపై ధీమాగా ఉన్నాయి రెండు ప్రధాన పార్టీలు.

"అమ్మ మరణంతో పార్టీలో శూన్యం ఆవరించింది. ఇదొక భావోద్వేగ సమయం. అమ్మ కలల సాధనే లక్ష్యంగా పళనిస్వామి, పన్నీర్​సెల్వం పార్టీని ముందుకు నడిపిస్తారు."

"కరుణానిధి మనముందు లేకపోవచ్చు. కానీ ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం. అన్ని మార్గాలను నిర్మించి వెళ్లారు. మేం వాటిని మరింత ముందుకు తీసుకుపోతాం."
-కేఎస్ రాధాకృష్ణన్​, డీఎంకే సీనియర్ నేత

భారీ విజయం సాధించి 'అమ్మ'కు అంకితమివ్వాలని పన్నీర్​సెల్వం, పళనిస్వామి భీష్మించారు. కలైంజ్ఞర్​ వారసత్వాన్ని నిలబెట్టాలని స్టాలిన్​ కంకణం కట్టుకున్నారు. అయినా కరుణానిధి, జయలలిత లేని లోటు ఆ పార్టీలపై తప్పకుండా పడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

"ఆ ఇద్దరు నేతలకు కొందరి ఓట్లు అంకితం. వారి మద్దతు ఓట్లు వారికే ఉంటాయి. కారణాలేమున్నా ఆ పరిస్థితిలో మార్పు వచ్చేది కాదు. ఇప్పుడు వారిద్దరూ లేనందున ఆ సంఖ్య తప్పకుండా తగ్గుతుంది."
-శ్యాం షణ్ముగం, రాజకీయ విశ్లేషకుడు

కొత్త లెక్కలు

అమ్మ మక్కల్​ మున్నేట్ర కళగం-ఏఎంఎంకే, మక్కల్​ నీది మయ్యమ్​-ఎంఎన్​ఎం... తమిళనాట కొత్త పార్టీలు. ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్​. ఎంఎన్​ఎం కమల్​ హాసన్​ది. జయ, కరుణ మరణాంతరం మారిన రాజకీయ సమీకరణాల మధ్య ఈ రెండు కొత్త పార్టీలు ఏమేరకు ప్రభావం చూపగలవన్నది ఆసక్తికరం.

దిగ్గజాలు లేని పోరులో విజేత ఎవరో, తమిళ రాజకీయం ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో మే 23న తేలనుంది.

ఇవీ చూడండి:

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Havana, Cuba - May 10, 2018 (CCTV - No access Chinese mainland)
1. Various of peace talks between Colombian government, National Liberation Army (ELN) in progress; press
FILE: Bogota, Colombia - Aug 29, 2016 (CCTV - No access Chinese mainland)
2. National flag of Colombia
FILE: Bogota, Colombia - Jan 17, 2019 (CCTV - No access Chinese Mainland)
3. Exterior of General Santander Police Academy
4. Police on horseback, vehicles on street
5. Soldiers asking someone questions
6. Vehicles on street
FILE: Bogota, Colombia - Date Unknown (CCTV - No access Chinese mainland)
7. Soldiers patrolling square, people
8. Various of street scenes, traffic
On Thursday night local time, Colombia's National Liberation Army (ELN) announced a week-long unilateral ceasefire starting on April 14, with the aim of creating convenience for holiday traffic.
After the two sides had their fifth round of talks in Cuba last year, negotiations have been stagnant between the Colombian government and the ELN.
The Colombian government insists on restarting conditional talks, which would include the ELN committing to abandon the use of kidnappings and violent attacks.
The ELN is Colombia’s largest rebel group since the Colombian government signed a peace agreement with the Revolutionary Armed Forces of Colombia (FARC).
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.