ETV Bharat / elections

చతికిలపడ్డ వామపక్షాలు.. 2 సీట్లకే పరిమితం

వామపక్షాలు లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూశాయి. దేశవ్యాప్తంగా రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుని భారీ ఓటమిని మూటగట్టుకున్నాయి.

author img

By

Published : May 24, 2019, 10:05 AM IST

Updated : May 24, 2019, 1:37 PM IST

వామపక్షాలు

వామపక్షాలు ఓట్ల వేటలో నానాటికీ వెనకబడుతూనే ఉన్నాయి. తాజా ఎన్నికల ఫలితాలు ఆ పక్షాలకు మరింత చేదు అనుభవాన్నే మిగిల్చాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతిన్నాయి.

1952 తర్వాత మళ్లీ ఇప్పుడే...

పదిలోపు లోక్​సభ స్థానాలకు వామపక్షాలు పరిమితమవడం 1952 తరువాత ఇదే మొదటిసారి. 2014లో 12 సీట్లతో వామపక్షాలు సరిపెట్టుకున్నాయి. 2009లో 24 స్థానాలు, 2004లో అత్యధికంగా 59 స్థానాల్లో వామపక్షాల అభ్యర్థులు గెలిచారు. తాజా ఎన్నికల్లో ఒకానొక దశలో 6 చోట్ల ఆధిక్యంలో ఉన్న వామపక్షాలు.. చివరకు రెండంటే రెండు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఆ రెండు స్థానాలూ కేరళలోనివే. బంగాల్​లో 34 ఏళ్ల పాటు ఎలాంటి అడ్డకుంలు లేకుండా గెలిచిన వామపక్షాలు.. 2014లో రెండు లోక్​సభ స్థానాల్లో మాత్రమే గెలిచాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఏ ఒక్క స్థానాన్నీ కైవసం చేసుకోలేకపోయాయి.

ఒకప్పటి కింగ్​మేకర్

సీపీఐ, సీపీఎం, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ ఎంల్ పార్టీలు 1990 వ దశకం నుంచి 2000 దశకం ప్రారంభం వరకూ స్వర్ణయుగాన్ని చూశాయి. ఈ సమయంలో మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, 55-60 పార్లమెంట్ సీట్లు ఉండేవి వామపక్షాలకు. 1996-98 మధ్య కాలంలో ఏర్పాటైన మూడో ఫ్రంట్ ప్రభుత్వానికి సహకరించే స్థితిలో ఉండేవి.

తగ్గిన ఓటు శాతం
2011లో బంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఓటమి, 2018లో త్రిపురలో పరాభవం వామపక్షాలను మరింత దెబ్బతీశాయి. తాజాగా కేరళలోని లోక్​సభ స్థానాల్లోనూ లెఫ్ట్​పార్టీలు బలహీనపడ్డాయి. 2014లో బంగాల్​లో 23శాతంగా ఉన్న వామపక్ష ఓటుబ్యాంకు.. ఈ అయిదేళ్ల కాలంలో 18 శాతానికి దిగజారింది. ఇదే సమయంలో 17.2 గా ఉన్న భాజపా ఓటు శాతం 40.1కి ఎగబాకింది. తృణమూల్ కాంగ్రెస్ ఓటుశాతం 39.7 నుంచి 43.5 కు పెరిగింది.

వామపక్షాల సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయడంలో నేతలు విఫలమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"వారెప్పుడూ కేంద్రంలో అధికారం కోసం పోరాడలేదు. 100 పైగా స్థానాల్లో ఎన్నడూ పోటీ చేయలేదు. ఈ కారణంగా కేవలం ఓ తోక పార్టీగా, ఓ ప్రాంతీయ శక్తిగానే లెఫ్ట్​పార్టీలను ఓటర్లు భావిస్తూ వస్తున్నారు. అన్ని సమస్యలకు వామపక్ష భావజాలమే సమాధానమని నమ్ముతూ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోకపోవడం ఇందుకు కారణంగా నిలుస్తోంది." - అపూర్వానంద్, దిల్లీ యూనివర్శిటీ అధ్యాపకుడు

బంగాల్​లో పోటీ చేసిన ఓ వామపక్ష అభ్యర్థి డిపాజిట్​ను కూడా కోల్పోయారు.

డిపాజిట్​ కోల్పోవడమంటే..

నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థి రూ.25వేల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 16.6 శాతం అభ్యర్థికి వస్తే ఆ డబ్బు తిరిగి చెల్లిస్తుంది ఈసీ. అంతకంటే తక్కువ శాతం ఓట్ల వస్తే అభ్యర్థి ఆ డిపాజిట్​ను కోల్పోతారు.

ఇదీ చూడండి : భారత్​ తీర్పు: పనిచేయని ప్రియాంక మ్యాజిక్​​

AP Video Delivery Log - 0200 GMT News
Friday, 24 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0147: Brazil Education Protest AP Clients Only 4212365
Protest in Sao Paulo over Bolsonaro education cuts
AP-APTN-0005: Germany Endangered Islands AP Clients Only 4212362
Climate concerns spur Green surge in Germany
AP-APTN-0003: US VA Arlington Flags AP Clients Only 4212361
Flags honour fallen heroes at Arlington Cemetery
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 24, 2019, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.