ETV Bharat / elections

తమిళనాట రసవత్తర ఎన్నికలకు సర్వం సిద్ధం - లోక్​సభ

తమిళనాడులో ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ లోక్​సభతో పాటు 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్​ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తమిళ రాజకీయం ఉపఎన్నికలతో కీలక మలుపు తిరిగే అవకాశముంది. ఒకేసారి చెన్నై, దిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్న అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే భవిష్యత్ ఈ ఫలితంపైనే ఆధారపడి ఉంది.

ద్రవిడ రాజకీయాన్ని మార్చే పోరుకు సర్వం సిద్ధం
author img

By

Published : Apr 18, 2019, 5:50 AM IST

ద్రవిడ రాజకీయాన్ని మార్చే పోరుకు సర్వం సిద్ధం

తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగల సత్తా ఉన్న ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్రంలోని 38 లోక్​సభ స్థానాలతో పాటు.. 18 అసెంబ్లీ స్థానాలకు మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరుగుతుంది.

త్రిముఖ పోరు...

టీటీవీ దినకరన్​ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సహా మరికొన్ని కారణాలతో ఖాళీ ఏర్పడిన 22 స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 18 నియోజకవర్గాల్లో ఈ రోజు పోలింగ్​ జరుగుతుంది. మిగతా 4 స్థానాలకు చివరి విడతలో భాగంగా​ మే 19న ఓటింగ్​.

తమిళనాడులోని మొత్తం అసెంబ్లీ స్థానాలు 234. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు 117. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకే బలం 114. మిత్రపక్షం కాంగ్రెస్​తో కలిపి డీఎంకే బలం 97. ఇప్పుడు ఉపఎన్నికల్లో సాధ్యమైనన్ని సీట్లు సాధించి, చక్రం తిప్పాలని భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు.

  • మెజారిటీ స్థానాలు గెలిచి.. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోంది స్టాలిన్​ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే).
  • టీటీవీ దినకరన్​ కూడా తన ప్రభావాన్ని చూపే పనిలో ఉన్నారు. దివంగత జయలలిత అసలైన వారసుడ్ని తానేనంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు దినకరన్. తమిళనాడు రాజకీయాల్లో కింగ్​మేకర్​ కాగలనని ఆయన ధీమా.
  • ప్రస్తుత పరిస్థితుల్లో మెజారిటీకి అవసరమైన 3 స్థానాలూ దక్కించుకోవడం పళనిస్వామి- పన్నీర్​ వర్గం ముందున్న ప్రధాన సవాలు.

ఐటీ, ఈసీ దాడుల నేపథ్యంలో...

ఇటీవలి కాలంలో తమిళనాడులో వరుస ఐటీ దాడులకు తోడు ఈసీ సోదాలు నిర్వహిస్తోంది. డీఎంకే నేత ఇంట్లో భారీగా నగదు పట్టుబడగా.. వెల్లూరు లోక్​సభ స్థానానికి ఎన్నిక రద్దు చేశారు. డీఎంకే, ఏఎంఎంకే అభ్యర్థులు, మద్దతుదారుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తున్నారు.

తూత్తుకుడి డీఎంకే అభ్యర్థి, దివంగత కరుణానిధి కుమార్తె కనిమొళి నివాసంలోనూ ఐటీ అధికారులు, ఈసీ బృందం వేర్వేరుగా సోదాలు చేసింది.

ఎన్నికల వేళ పొత్తులు...

పీఎంకే, డీఎండీకే, భాజపా.. అన్నాడీఎంకే మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఎండీఎంకే, వీసీకే, కాంగ్రెస్​లు డీఎంకే కూటమిలో ఉన్నాయి. కమల్​హాసన్​ ఎంఎన్​ఎం ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతుంది.

లోక్​సభ ఎన్నికలతో పాటుగా..

అసెంబ్లీ ఉపఎన్నికలతో పాటు రాష్ట్రంలోని 38 లోక్​సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 67,720 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 7,780 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది.

3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. 160 కంపెనీల పారామిలిటరీ, లక్ష మంది రాష్ట్ర పోలీసులతో పహారా ఏర్పాటు చేసింది ఈసీ.

ఇదీ చూడండీ: దిగ్విజయ్​పై బరిలో సాధ్వి ప్రగ్యా సింగ్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Middle East and North Africa. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:  The Arena Stadium, Ahmedabad, India. 17th April 2019
Chennaiyin FC (all blue) 2-0 Manang Marshyangdi Club
1. 00:00 Teams walk out
2. 00:09 Cutaway home fans
First half:
3. 00:11 Chance for Chennaiyin - Jeje Lalpekhlua has shot deflected wide in the 5th minute, 0-0
4. 00:23 Chance for Manang - Sujal Shrestha has shot saved in the 45th minute, 0-0
Second half:
5 . 00:35 Goal for Chennaiyin - Chris Herd in the 51st minute, 1-0 Chennaiyin
6. 00:56 Replays of the goal
7. 01:09 Goal for Chennaiyin - Mailson Alves following an Anirudh Thapa corner in the 53rd minute, 2-0 Chennaiyin
8. 01:28 Chance for Manang - Abhishek Rijal has shot saved following Kamal Shrestha's cross in the 88th minute, 2-0 to Chennaiyin
9. 01:47 Chance for Chennaiyin - Dhanpal Ganesh shoots high in the 90+2nd minute, 2-0 to Chennaiyin
SOURCE: Lagardere Sports
DURATION: 02:02
STORYLINE:
Indian Super League outfit Chennaiyin FC struck twice in two minutes early in the second half in a 2-0 win over Manang Marshyangdi Club of Nepal on Wednesday, a result which lifted John Gregory's side to the top of Group E in the AFC Cup.
Former Australia international Chris Herd got the opener on 51 minutes from a deflected right foot effort and moments later club captain Mailson Alves headed in from a corner to secure the victory.
Chennaiyin now have four points from two games and lead Dhaka Abahani of Bangladesh on goal difference.
Minerva Punjab of India's I-League are third on two points, with MMC bottom after two straight defeats.
The top two will go toe-to-toe in Ahmedabad in two weeks' time, while Manang return to India to take on Minerva.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.