హైదరాబాద్ అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద కలకలం రేగింది. స్టేషన్ రెండో అంతస్తు నుంచి ఓ యువతి కిందకు దూకి ఆత్మహత్యకు (young woman jumped from metro station)యత్నించింది. పక్కనే ఉన్న టింబర్ డిపోలో పడిపోయింది. ఈ ఘటన ఈ సాయంత్రం 8 గంటల సమయంలో జరిగింది. వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. యువతి టోలీచౌకికి చెందిన హీనా (20)గా (young woman jumped from metro station) గుర్తించారు. బీటెక్ చదువుతూ అమీర్‌పేటలోని హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలిపారు. కుటుంబ సమస్యలా? ఆర్థిక సమస్యలా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు..
ఈ ఏడాది అక్టోబర్ 1న హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ నుంచి దూకిన వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి (Suicide at Metro station) చెందాడు. మృతుడు ఛత్తీస్‌గఢ్ పుల్పహాడ్ ప్రాంతంలోని కువకొండ వాసి భీమా(45)గా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ వాసి భీమా గురువారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడే కాసేపు అటూ ఇటూ తిరిగాడు. ఎవరూ చూడని సమయంలో ఒక్కసారిగా మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాడు(Suicide at Metro station). మెట్రో కింద ఉన్న చిరువ్యాపారులు, ప్రయాణికులు, ఇతరులు ఇది గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గత ఏడాది హైదరాబాద్ మెట్రో తార్నాక స్టేషన్ పైనుంచి ఓ యువకుడు కిందకు దూకాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీచూడండి: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. 20 పూరిళ్లు దగ్ధం..పేలుతున్న సిలిండర్లు