ETV Bharat / crime

ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి.. - నేర వార్తలు

young women died
యువతి మృతి
author img

By

Published : Oct 8, 2022, 2:22 PM IST

13:47 October 08

యువతి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది

సమాజంలో రోజురోజుకు ఆడపిల్లలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల కనిపిస్తే చాలు... క్రూరమృగాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారు కొందరు.. వావి వరసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నవారు మరికొందరు. ప్రేమిస్తున్నామని వెంటపడి మోసం చేసేవారు కొందరు. ఆ ప్రేమను కాదంటే కాలయములుగా మారి ప్రాణాలు తీస్తున్నవారు ఇంకొందరు.. ఇలా ఎక్కడ చూసినా మహిళల మానప్రాణాలకు రక్షణ కనిపించడంలేదు. తాజాగా తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని హతమార్చాడు ఓ ప్రేమోన్మాది. అసలేం జరిగిందంటే..

ప్రేమించడం లేదని ఓ యువతిని దారికాసి గొంతుకోసి చంపేశాడో యువకుడు. ఏపీలోని కాకినాడ జిల్లా కూరాడకు చెందిన యువతిని కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ.. ప్రేమించాలంటూ ఓ యువతి వెంట పడేవాడు. కానీ ఆ యువతి అందుకు నిరాకరించింది. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న యువకుడు.. ఇవాళ కూరాడ-కాండ్రేగుల గ్రామాల మధ్య దారి కాచాడు. ఆ మార్గంలో యువతి నడిచి వెళ్తుండగా కత్తితో ఆమె గొంతు కోశాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని స్థానికులు చూసి.. 108 అంబులెన్స్​కు ఫోన్ చేశారు. కానీ అంబులెన్స్ వచ్చేసరికి యువతి ప్రాణం పోయింది. పారిపోయేందుకు యత్నించిన యువకుడిని.. చెట్టుకు కట్టేసి స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులో తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.