ETV Bharat / crime

Youth Gang War in LB Nagar : హైదరాబాద్​లో గ్యాంగ్ వార్.. యువకుడు మృతి - hyderabad gang war case details

Gang War in LB Nagar
Gang War in LB Nagar
author img

By

Published : Jan 2, 2022, 12:28 PM IST

Updated : Jan 2, 2022, 2:19 PM IST

12:26 January 02

Youth Gang War in LB Nagar : హైదరాబాద్​లో గ్యాంగ్ వార్.. యువకుడు మృతి

Youth Gang War in LB Nagar : హైదరాబాద్ ఎల్బీనగర్​లో శనివారం రాత్రి దారుణం జరిగింది. కేకే గార్డెన్ వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో రెండు వర్గాల యువకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలు, రాళ్లతో కొట్టుకోవడంతో నర్సింహారెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

ఏం జరిగింది?

LB Nagar Gang War on New Year : శనివారం సాయంత్రం దుకాణం మూసివేసి.. కేకే గార్డెన్ వెనక ఉన్న ఉండే ఖాళీ ప్రదేశంలో మరో స్నేహితుడితో కలిసి నర్సింహారెడ్డి మద్యం సేవించాడు. అక్కడే ఉన్న మరో నలుగురు యువకులతో గొడవ తలెత్తింది. ఈ క్రమంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నర్సింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకొని నర్సింహారెడ్డి స్నేహితులు అక్కడికి చేరుకోగా.. వారిపైనా ఆ నలుగురు యువకులు దాడి చేసినట్లు మృతుడి సోదరుడు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నలుగురు యువకులను ఆస్పత్రిలో చేర్పించారు.

ఇదీ చదవండి: Rowdy sheeter murder at tadepalligudem: రౌడీషీటర్​, అతని అనుచరుడి హత్య..!

Last Updated : Jan 2, 2022, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.