మామ అంతక్రియలకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై ఒక యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొత్త లింగాయిపల్లి గ్రామానికి చెందిన మహేష్... తన మామ మరణించడంతో.. అంతక్రియల కోసం రామతీర్థం గ్రామానికి వెళ్లాడు.
బహిర్భూమి కోసం రెండు పడకల ఇంటి నిర్మాణాల వెనుక భాగానికి వెళ్లగా.. బోరుబావికి విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైరుకు తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట్ ఎస్సై సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: భూముల విక్రయానికి సర్కారు ప్రకటన.. జూలై 15న ఈ-వేలం