ETV Bharat / crime

తరచూ అనారోగ్యం... యువకుడి బలవన్మరణం - young man suicide in sangareddy

సంగారెడ్డి జిల్లా​ అమీన్​పూర్​ కేజీఆర్ ఎంక్లేవ్ల్​లో విషాదం చోటుచేసుకుంది. తరచూ అనారోగ్యం పాలవుతున్నానన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

young man suicide for his illness in ameenpur

author img

By

Published : Feb 13, 2021, 10:21 AM IST

తరచూ అనారోగ్యం పాలవటం వల్ల మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణం చెందాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా​ అమీన్​పూర్​లో జరిగింది. కేజీఆర్ ఎంక్లేవ్ల్​లో సంతోశ్​ కుమార్ అనే వ్యక్తి మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మూడేళ్ల కిందట అతని మూత్రపిండాల్లో రాళ్ళు రాగా... లేజర్ చికిత్స తీసుకున్నాడు. మళ్లీ అదే సమస్య పునరావృతమై... తరచూ అనారోగ్య పడేవాడు.

ఎంతకీ తన అనారోగ్య సమస్యకు పరిష్కారం దొరక్కపోవటం వల్ల తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. తాను నిర్వహించే మొబైల్ దుకాణం పక్క గదిలో ఫ్యాన్​కు కరెంటు తీగతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన బావ లోకేశ్​... వెంటనే మదినాగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఎస్సారెస్పీలో కొట్టుకుపోతున్న ఆ మృతదేహాలు ఎవరివి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.