రుణయాప్‌ల పేరు వింటేనే జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ కంపెనీల నుంచి ఫోన్లు వస్తే చాలు చనిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. కనీసం రోజుకొకరైన రుణయాప్‌ల వేధింపులు తాళలేక వారి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసిన వారిని ఏలా పట్టుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన రామారావు అప్పు చేసి.. ఏజెంట్ల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణం చెల్లించాలని రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేఖ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపారు. 25 రోజుల క్రితం భార్యకు డెలివరీ అవడంతో.. పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అతను ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే పలు ఫైనాన్స్ కంపెనీల వద్ద క్రెడిట్ కార్డ్ ద్వారా అప్పులు తీసుకున్నాడు. కొంత నగదు చెల్లించినప్పటికీ... రికవరీ ఏజెంట్లు తరచూ ఫోన్ చేసి డబ్బులు అడిగే వారు. దీనితో మనస్తాపానికి గురైన రామారావు .. తాను ఉంటున్న గదిలోనే ఉరేసుకుని చనిపోయాడు. రికవరీ ఏజెంట్లు వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్లు ఆరోపిస్తూ... ఒక ఆత్మహత్య లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: