ETV Bharat / crime

Rape on Woman: రెండు రోజుల పరిచయం.. మూడో రోజు అత్యాచారం - telangana news

Rape on Woman : సోషల్ మీడియాలో దొరికిన అమ్మాయికి గాలం వేద్దామనుకున్నాడు. ప్రొఫైల్ బాగుంది అనిపించిన ఓ అమ్మాయికి మొదటి రోజు ఇన్‌స్టాగ్రామ్‌ రిక్వెస్ట్.. రెండో రోజు వాట్సాప్ ఛాటింగ్.. మూడో రోజు మీటింగ్..ఇలా ప్లాన్ చేశాడు. అతను అనుకున్నట్లుగానే ఓ అమ్మాయి ఎరగా దొరికింది. మాయమాటలు చెప్పాడు.. నమ్మబలికి కలుద్దామన్నాడు. జస్ట్ మీటింగే కదా.. ఇదంతా ఇప్పుడు కామన్ అనుకుని వెళ్లిన ఆ యువతికి ఆ మృగాడి మాటల వెనకున్న ఆంతర్యం తెలియలేదు. చివరకు ఏమైందంటే..

Rape on Woman: రెండు రోజుల పరిచయం.. మూడో రోజు అత్యాచారం

author img

By

Published : Mar 2, 2022, 8:29 AM IST

Rape on Woman: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్ చూసి అమ్మాయి బాగానే ఉందనుకుని రిక్వెస్ట్ పంపాడు. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయగానే నెమ్మదిగా మాట కలిపాడు. తీయని మాటలు చెబుతూ.. మాయ చేశాడు. ఇన్‌స్టా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాతి రోజే అమ్మాయి ఫోన్ నంబర్ అడిగాడు. నంబరే కదా ఏమవుతుంది.. అంతగా తేడా వస్తే బ్లాక్ చేయొచ్చనుకుని ఆ యువతి తన నంబర్‌ను అతనికి ఫార్వార్డ్ చేసింది. ఇంకేంటి వాట్సాప్‌లో నిరంతరం ఛాటింగ్ షురూ అయింది. మొదటి రోజు ఇన్‌స్టా.. రెండో రోజు వాట్సాప్‌.. ఇక కలవడమే తరువాయి అనుకుని మూడో రోజే కలుద్దాం అని అడిగేశాడు. అతని మాయలో పూర్తిగా పడిపోయిన ఆ అమ్మాయి కలవడానికి కూడా సరేనంది. కానీ ఆ మగాడిలో ఓ మృగం ఉందని తెలుసుకోలేకపోయింది.

"రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని సులేమాన్‌నగర్‌లో నివసించే సాజిత్‌(27) ప్రైవేటు ఉద్యోగి. అతడికి రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోష్‌నగర్‌కు చెందిన ఓ మహిళ(20)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోన్‌ నంబర్లు తీసుకొని ఛాటింగ్‌ చేసుకున్నారు. సాజిత్‌ మహిళను మంగళవారం కలవాలని కోరాడు. రాజేంద్రనగర్‌కు వచ్చిన మహిళను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని సులేమాన్‌నగర్‌లో నివసించే అతడి స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ సదరు మహిళపై అత్యాచారం చేశాడు. మహిళ 100కు కాల్‌ చేయడంతో మేం అక్కడికి చేరుకొని సాజిత్‌ను అదుపులోకి తీసుకున్నాం. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం."

- రాజేంద్రనగర్‌ సీఐ కనకయ్య

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.