ETV Bharat / crime

ఈత నేర్పిస్తామని చెరువులో నెట్టేసిన స్నేహితులు.. యువకుడు మృతి!

ఈత రాదని తెలిసినా ఓ వ్యక్తిని స్నేహితులంతా కలిసి చెరువులోకి నెట్టేశారు. తాము నేర్పిస్తామంటూ ఒడ్డున వ్యక్తిని బలవంతంగా చెరువులో ముంచారు. ఈతరాని ఆ యువకుడు నీటిలోనే మునిగి కనిపించకుండా పోయాడు. చివరకు శవమై తేలాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

young man dead in pond, young man drowned
చెరువులో మునిగి యువకుడు మృతి, ఈత రాక యువకుడు మృతి
author img

By

Published : Apr 5, 2021, 1:37 PM IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈత నేర్పిస్తామని స్నేహితుడిని చెరువులోకి నెట్టేడంతో గల్లంతైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. దమ్మాయిగూడకు చెందిన పోచయ్య, ఘట్‌కేసర్‌ బాలాజీనగర్‌కు చెందిన గోపి, శ్రీను స్నేహితులు. వారంతా దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. మద్యంమత్తులో ఎండవేడికి చెరువులో ఈత కొట్టాలని అంతా అనుకున్నారు. ఈతరాదని శ్రీను చెప్పినా వినకుండా కొండాపూర్‌లో చెరువువద్దకు తీసుకెళ్లారు. పోచయ్య, గోపి అందులోకి దిగారు.

శ్రీను ఒడ్డుపై ఉండటంతో ఈతనేర్పిస్తామని చెప్పి బలవంతంగా నెట్టేయగా ఒక్కసారిగా మునిగి కనిపించకుండా పోయాడు. భయపడిన పోచయ్య, గోపి... ఆదివారం సాయంత్రం ఘట్‌కేసర్ ఠాణాకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. ఘటనా స్థలికి చేరుకున్న చేరుకున్న పోలీసులు గల్లంతైన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. ఇవాళ ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పిచ్చికుక్క స్వైరవిహారం.. 8 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.