కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు శివారులోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన దాసారపు నిఖిల్ క్వారీలోకి దినసరి కూలీ పనులకు వెళ్లాడు. పనుల్లో భాగంగానే క్రంపెషర్ ట్రాక్టర్‌కు చెందిన జాకీ పనులు చేస్తుండగా ప్రమాదవవశాత్తు నిఖిల్‌పై ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న సీఐ ఎర్రల కిరణ్, ఎస్సై తిరుపతి సిబ్బందితో కలిసి క్వారీకి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'బీబీనగర్ ఎయిమ్స్‌ను కొవిడ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అనుమతించాలి'