ETV Bharat / crime

తల్లిదండ్రుల మందలింపు.. యువకుడు ఆత్మహత్య - suicide news in telangana

తల్లిదండ్రులు మందలించారని పాతికేళ్లు కూడా నిండని యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా లెంకలపల్లి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

young man suicide
యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Mar 21, 2021, 3:59 PM IST

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం(21) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండటంతో తల్లిదండ్రులు మందలించారని తనువు చాలించాడు.

మనోధైర్యం కోల్పోయి..

నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు మద్దతుగా శ్రీశైలం.. 2 నెలల పాటు ప్రచారంలో పాల్గొన్నాడు. ఫలితాల్లో మల్లన్న ఓడిపోవడంతో అతను మనోధైర్యం కోల్పోయాడు. దీనికి తోడు ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నావని తల్లిదండ్రులు మందలించడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చదవండి: కట్టెల మండిలో భారీ అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.